హైదరాబాద్ ఆల్విన్ చౌరస్తాలో లారీ ద‌గ్ధం

 హైదరాబాద్ ఆల్విన్ చౌరస్తాలో లారీ ద‌గ్ధం

హైద‌రాబాద్ నగరంలోని మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో భారీ పేలుడు ఘటన జరిగింది. ఇవాళ‌ తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రసాయనాలను తరలిస్తున్న లారీలో భారీ పేలుడు జరిగింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు మంటలు చెలరేగాయి. మంట‌లు వ‌చ్చిన వెంట‌నే డ్రైవర్ లారీ నుంచి దూకేశాడు. పోలీసులు స్పందించి వెంట‌నే ‌ఫైర్ సిబ్బందికి సమాచారం అందించ‌డంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తెల్ల‌వారుజామున ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఆ ప్రాంతంలో ప్ర‌జలెవ‌రూ లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాదం ప‌గ‌లు జ‌రిగి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగివుండేదని స్థానికులు అనుకుంటున్నారు.