అందులో తప్పేంటి?

Updated By ManamThu, 06/14/2018 - 00:50
adithi

imageమణిరత్నం ‘చెలియా’తో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన హైదరాబాద్ అమ్మాయి అదితిరావు హైదరి. తెలుగులో ‘సమ్మోహనం’తో పాటు సంకల్ప్‌రెడ్డి సినిమాలో నటిస్తుంది. తనకు భాష కంటే పాత్ర, కథ, దర్శకుడు ముఖ్యమంటుంది హైదరి. ‘‘నాకు ఉత్తరాది, దక్షిణాది సినిమా అనే తేడాలు లేవు. నేను హీరోయిన్..అంత కంటే ముందు ఓ నటిని. నటిగా కొంత మంది దర్శకులతో పనిచేయాలనుకుంటాను.

అందులో తప్పేంటి?..  ముందు దర్శకుడు చెప్పే కథ వింటాను. నచ్చితే నాకు లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. మణిరత్నంగారితో ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో రెండో సినిమా కూడా చేస్తున్నాను. హీరోయిన్స్ గురించి తక్కువ కొంతమంది భావన ఉంటుంది. హీరోయిన్స్ అంటే గ్లామర్ మాత్రమే కాదు. సినిమా సక్సెస్‌లో వారి కష్టమెంతో ఉంటుంది’’ అంటూ తన మనసులోని భావాలను 
వెల్లడించింది. 

English Title
whats the mistake?
Related News