ఫోటోల కోసమే అలా చేశాం

Updated By ManamWed, 06/13/2018 - 00:35
priyanka

imageసినిమా తారల వ్యక్తిగత జీవితాలు ఎలా ఉం టాయి? వారు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఎవరితో ప్రేమాయణం నడుపుతున్నారు? వంటి విషయాలు అందరికీ ఆసక్తిని కలిగించేవే. ఈమధ్యకాలంలో సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఆ కుతూహలం బాగా ఎక్కువైందని చెప్పాలి. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన రూమర్సే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఒక వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌తో ప్రియాంక ప్రేమలో పడిందని, వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమధ్య ఓ పెళ్ళిలో ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడవడం ఇలాంటి రూమర్లకు దారి తీసింది. ప్రియాంక, నిక్ జోనాస్ కొత్త జంటలా ఈ పెళ్లికి హాజరయ్యారు. దీంతో ప్రియాంక వివాహం నిక్‌తోనే అవుతుందన్న వార్త బలంగా వినిపిస్తోంది. గతంలో ప్రియాంక, నిక్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2017లో రెడ్ కార్పెట్‌పై ఇరువురూ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. దానికి వివరణ ఇస్తూ ‘ఇద్దరం రాల్ఫ్ లారెన్ డ్రెస్‌లు వేసుకున్నాం కాబట్టి ఫోటోలకు అలా ఫోజిచ్చాం’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. 

English Title
We did so for photos
Related News