రెండో సినిమా శర్వానంద్‌తో..

Updated By ManamFri, 11/09/2018 - 23:43
sharvanand

imageసుధీర్‌బాబు హీరోగా ఇటీవల విడుదలైన ‘నన్ను దోచుకుందువటే’ చక్కని ప్రేమకథగా అందరి ఆదరణ పొందిన ఈ సినిమా ద్వారా ఆర్.ఎస్.నాయుడు దర్శకుడుగా పరిచయ మయ్యారు. ప్రస్తుతం ఆయన తన రెండో సినిమాను పట్టాలెక్కిం చేందుకు సిద్ధమవుతు న్నారు. నాయుడు సిద్ధం చేసుకున్న కథకు శర్వానంద్ హీరో అయితే బాగుంటుందని భావిస్తున్నారు. శర్వానంద్‌కు లైన్ వినిపించిన నాయుడు అతని రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. శర్వానంద్ ఈ సినిమాకి ఓకే చెబితే వెంటనే సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది.

English Title
Second movie with sharvanand
Related News