కారులో చంద్రబాబు రయ్.. రయ్..

chandrababu signing of Future Mobility Partnership MoU with Kia Motors in

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో ఎలక్ట్రికల్ కారులో  ప్రయాణం చేశారు. సచివాలయంలో కియా కార్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను ఆయన ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కియా కారు సౌకర్యవంతంగా ఉన్నాయని అన్నారు. 

ఇక్కడ తయారైన కియా కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం కియా అడుగుపెట్టడంతో పూర్తిగా మారిపోయిందని, ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. 7300 మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను త్వరలో వ్యర్థం సేకరణ ప్రక్రియలో వినియోగించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. 

 ఏపీఐఐసీ ఎండీ ఎ. బాబు, కియా మోటర్స్ సీఈవో షిమ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అత్యంత ఆధునిక నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ర్ట ప్రభుత్వానికి బహుమతిగా కియా మోటార్స్ ఇచ్చింది. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంది. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులు, కియా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు