Home » రతిక బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

రతిక బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

బిగ్ బాస్ సీజన్ సెవెల్ లో కంటిస్టెంట్ గా కొనసాగుతున్న రతిక రోజ్ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రతిక రోజ్ బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ..  యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె నిజ జీవితంలో మాత్రం ఓ బ్రేకప్ స్టోరీ ఉన్నట్టు తెలుస్తోంది. రతిక రోజ్ బ్రేక్ విషయం కట్టు కథ కాదండోయ్.. ఇది వాస్తవమే. ఆ విషయాన్ని స్వయంగా రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జునతో స్టేజ్ పై డిస్కస్ చేసింది.

Advertisement

చాలా అందంగా ఉండే రతికకు బ్రేకప్ ఆ బాయ్ ఫ్రెండ్ మరెవ్వరో కాదు.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నే అట. వీరిద్దరూ గతంలో పలు ప్రైవేటు వీడియో సాంగ్స్ ఆల్బమ్ లలో కలిసి నటించారు.  అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వినిపిస్తోంది. చాలా కాలం పాటు వీరిద్దరూ రిలేషన్ షిప్ ఉన్నారట. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ లోకి వచ్చి విజేతగా నిలిచిన తరువాత వీరిద్దరూ విడిపోయారని టాక్. ప్రేమలో పీకల దాకా మునిగిపోయిన రతిక-రాహుల్ సిప్లిగంజ్ విడిపోవడానికి కారణం బిగ్ బాసేనట. బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ కంటెస్టెంట్ గా వచ్చిన తరువాత పునర్నవి భూపాలం అనే కంటిస్టెంట్ తో లవ్ ట్రాక్ నడిపాడు. అది జనాల్లో పాపులర్ కావడంతో రాహుల్, రతికను వదిలేసి పునర్నవిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించాయి.

Advertisement

ఈ వార్తల్లో వాస్తవం లేకపోయినప్పటికీ ఈ రూమర్స్ కారణంగా రాహుల్ సిప్లిగంజ్ రతిక ఇద్దరూ విడిపోయారట. ఇప్పటికీ కూడా రతిక రాహుల్ ని మిస్ అవుతోందని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో రతిక ఈ విషయంపై ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. రతిక ఎవ్వరినైనా మిస్ అవుతున్నావా అని బిగ్ బాస్ అడగ్గా.. రాహుల్ గురించి ఓపెన్ అయి కన్నీరుపెట్టుకుంది. దీంతో బిగ్ బాస్ రతిక కోసం రాహుల్ సిప్లిగంజ్ గతంలో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పునర్నవి కోసం పాడిన పాటను ప్లే చేశాడు. ఆ పాటతో రతిక మనస్సు మరింతగా బాధ పడిందని.. ప్రోమోలో ఆమె రియాక్షన్ బట్టి చెప్పవచ్చు. ప్రోమోలో ఈ ట్విస్ట్ ఎపిసోడ్ లో ఎంత ఎంటర్టైనింగ్ ఉండబోతుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఘట్టమనేని కుటుంబంలో ప్రతీ ఒక్కరిలో ఉన్న ఈ కామన్ క్వాలిటీ మీకు తెలుసా ?

 కెరీర్ లో ఫస్ట్ టైం అనుష్క విలన్ గా నటిస్తోందని తెలుసా? ఏ సినిమాలో అంటే?

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading