Home » కెరీర్ లో ఫస్ట్ టైం అనుష్క విలన్ గా నటిస్తోందని తెలుసా? ఏ సినిమాలో అంటే?

కెరీర్ లో ఫస్ట్ టైం అనుష్క విలన్ గా నటిస్తోందని తెలుసా? ఏ సినిమాలో అంటే?

by Srilakshmi Bharathi
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి మళ్లీ సినిమాల పరంగా తన జోరు పెంచిందని తెలుస్తోంది. ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న స్వీటీ.. తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల కానుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో అనుష్క తొలిసారిగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. పి.మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి మలయాళంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

Advertisement

అనుష్క తన 18 ఏళ్ల సినీ జీవితంలో తెలుగు, తమిళం సినిమాల్లో తప్ప ఇతర భాషా సినిమాల్లో నటించలేదు. మొదటిసారిగా అనుష్క మలయాళం సినిమాలో నటిస్తున్నారు. “కథానార్” అనే మలయాళం సినిమాలో అనుష్క విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం తనదైన ప్రతిభ చూపించిన అనుష్క శెట్టి ఇక విలన్ గా ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

Advertisement

‘కథనార్’ హారర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ హారర్ మూవీలో మలయాళ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కడమట్టు అనే ప్రాంతంలోని చర్చి ఫాదర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదలయ్యాయి. హారర్ ఎలిమెంట్స్‌తో కొత్త బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని..

ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీలో వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ?? ఏ రోల్ లో అంటే?

ఇండియా Vs భారత్ వివాదం.. ఈ 10 దేశాలు పేర్లు మార్చుకున్నాయనే విషయం మీకు తెలుసా ?

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading