Home » Mehreen pirzada: నెట్టింట్లో మెహరీన్ సందడి.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది..!

Mehreen pirzada: నెట్టింట్లో మెహరీన్ సందడి.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది..!

by Sravya
Ad

Mehreen pirzada: హీరోయిన్ మెహరీన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మెహరీన్ అందరికీ సుపరిచితమే, ఇప్పటికే పలు సినిమాలలో నటించి ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. హీరోయిన్ మెహరీన్ పెళ్లి అవ్వకుండా తల్లి అవ్వబోతుంది. మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తీసుకున్న నిర్ణయం మీద ఒక పోస్ట్ కూడా చేసింది గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ ని కొనసాగిస్తున్నా అని ఈ విషయాన్ని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నానని చెప్పారు.

 ఆల్రెడీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఉపసన, మృణాల్ ఠాకూర్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెహరీన్ కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకి వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించానని, నా మనసుని సిద్ధం చేసుకోవడానికి రెండేళ్లు పట్టిందని ఆమె అన్నారు. చివరకు నేను దీన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవాలా వద్దా అని ఆలోచించానని కానీ నాలాంటి చాలామంది మహిళలు ఉన్నారని నేను అనుకున్నాను. వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదా బిడ్డని కనాలి అని ఇంకా నిర్ణయాన్ని తీసుకుని ఉండరు.

Advertisement

Advertisement

Also read:

Also read:

అయితే ఫ్యూచర్ కోసం భవిష్యత్తులో వచ్చే సంక్లిష్టతని నివారించేందుకు అందరు స్త్రీలు దీన్ని ఎంచుకోవాలని నేను భావిస్తున్నానని మెహరీన్ ఈ విధంగా పోస్ట్ చేశారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. తల్లి కావాలని ప్రతి మహిళా కళా వయసు అయిపోయింది అన్న కారణంతో ఆ కోరికని చంపుకోలేము. ఈ ప్రాసెస్ బాధించిందా అంటే కొన్నిసార్లు భావించింది సవాలుగా ఉందా అంటే చాలా సార్లు చాలెంజింగ్ గానే అనిపించింది. ఇంజక్షన్ వలన కలిగే నిరంతర మానసిక గందరగోళం అంత ఈజీ కాదు కానీ ఇదంతా  వర్త్ ఆ అంటే కచ్చితంగా వర్త్ అని చెప్పగలను అని మెహరీన్ ఈ విధంగా పోస్ట్ చేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading