Home » ఘట్టమనేని కుటుంబంలో ప్రతీ ఒక్కరిలో ఉన్న ఈ కామన్ క్వాలిటీ మీకు తెలుసా ?

ఘట్టమనేని కుటుంబంలో ప్రతీ ఒక్కరిలో ఉన్న ఈ కామన్ క్వాలిటీ మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది గుర్తింపు సంపదించుకున్న నటీనటులు ఉన్నారు. వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ ఒకటి. ఘట్టమనేని  కృష్ణ వారసుడిగా రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. అంతకు ముందు రెండు మూడు సినిమాల్లో కృష్ణతో కలిసి నటించినప్పటికీ హీరోగా మాత్రం రాజకుమారుడు మూవీనే మొదటిది అని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్రహీరోగా కొనసాగుతున్నాడు.  సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

Advertisement

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోతెరకెక్కే గుంటూరు కారం మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో గ్లోబల్ లేవల్ లో ఓ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు కుటుంబానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబ సభ్యుల్లో ప్రతీ ఒక్కరిలోనూ ఓ క్వాలిటీ ఉంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మహేష్ బాబు కుటుంబ సభ్యుల్లో ఉన్న ఈ కామన్ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ హీరోగానే కాకుండా ఇండస్ట్రీలో దర్శకునిగా, నిర్మాతగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏమాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు.

Advertisement

ఇప్పుడు అదే అలవాటు మహేష్ బాబుకి కూడా వచ్చింది. మహేష్ ఏకంగా ఓ ఫౌండేషన్ స్థాపించి పలు ఆసుపత్రిలతో అనుసంధానమై పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మహేష్ బాటలోనే తన పిల్లలు కూడా నడుస్తున్నారు. చిన్న వయస్సులోనే సితార చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాను నటించిన ఫస్ట్ యాడ్ కి రూ.కోటి రావడంతో ఆ డబ్బును మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచితంగా సైకిళ్లను కొనిచ్చారు. అదేవిధంగా గౌతమ్ కూడా ఫౌండేషన్ తో అనుసంధానమైనటువంటి ఆసుపత్రులకు వెళ్లి అక్కడ చిన్నారులను పలకరించి కానుకలు ఇవ్వడమే కాకుండా ముఖంలో చిరునవ్వులు వచ్చేవిధంగా చేశారు. మొత్తానికి ఘట్టమనేని కుటుంబంలో ప్రతీ ఒక్కరిలో కూడా సహాయం చేసే జాలి, దయ అనే కామన్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Jawan Movie Review : ‘జవాన్’ రివ్యూ..బాక్సాఫీస్ వ‌ద్ద షారుక్ సునామీ…

 వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ఈ మిస్టేక్ మీరు గమనించారా ?

Visitors Are Also Reading