Home » ఇండియన్ 2 లో కమలహాసన్ చనిపోతాడా..? ఎండింగ్ ఎలా ఉంటుంది..?

ఇండియన్ 2 లో కమలహాసన్ చనిపోతాడా..? ఎండింగ్ ఎలా ఉంటుంది..?

by Sravya

తమిళ మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు కమల్ హసన్. ఈయన ఒకప్పుడు చేసిన భారతీయుడు మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ గా ఇంకో సినిమా చేయాలని శంకర్ చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టకేలకు ఇప్పుడు వర్క్ అవుట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చేయబోయే ఈ సినిమా విషయంలో కమల్ హాసన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది.

ఈ మూవీలో చాలా బిజీగా ఉంటున్నారు కమల్ హాసన్. ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయింది అంటే కమల్ హాసన్ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కమల్ హాసన్ చివర్లో చనిపోతున్నారా అనే వార్తలు వినపడుతున్నాయి. భారతీయుడు మూవీలో కమల్ హాసన్ చనిపోకుండా ఉండడానికి కారణం ఏంటి అనే దానికి ఎప్పటికైనా సీక్వెల్ సినిమా తీయాలి అని ఉద్దేశంతో అలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also read:

Also read:

ఇప్పుడు ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ చనిపోతున్నాడా అంటే సినిమా యూనిట్ నుండి మాత్రం అవును అని సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ చివర్లో ఎమోషన్ ని జోడించారు. ఎమోషనల్ ని పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లడానికి కమల్ హాసన్ ని చంపేబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలానే ఈ మూవీలో కమల్ హాసన్ ఒక్క రోల్ చేస్తున్నారా..? డ్యూయల్ రోల్ చేస్తున్నారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇంకోసారి భారీ హిట్ ని అందుకు పోతున్నట్లు టాలీవుడ్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా అందర్నీ ఎంతలా అలరిస్తుందనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading