Home » పవన్ కళ్యాణ్ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎంతంటే? 

పవన్ కళ్యాణ్ సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎంతంటే? 

by Anji
Ad

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది శ్రీలీల. టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పెళ్లిసందD సినిమాలో అద్భుతమైన నటనతో పాటు, అందం, అభినయంతో  కూడా మెప్పించింది. కేవలం శ్రీలీల గ్లామర్ ని మాత్రమే నమ్ముకోలేదని.. నటనతో కూడా ఆకట్టుకోవాలనుకుంటోంది. ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన ధమాకా చిత్రంతో శ్రీలీల డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 

Advertisement

ధమాకాతో ఫుల్ ఫామ్ లో ఉన్నమహేష్- త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించనుందని తెలుస్తోంది. ఇందుకోసం రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకోనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో కేవలం ఓ సాంగ్ చేయడానికి శ్రీలీల రూ.60 లక్షలు డిమాండ్ చేస్తోందట. ఈ చిత్రానికి టైటిల్ ని పిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనుండడంతో ఈ చిత్రానికి దేవుడు అని ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. 

Advertisement

ప్రస్తుతం శ్రీలీల చేతిలో 7 సినిమాలున్నాయి అని తెలుస్తోంది. ఆమెకు ఈ రేంజ్ లో అకాశాలు రావడానికి మాత్రం ఓ వ్యక్తినే కారణమట. అతని వల్లనే తెలుగులో ఈ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయని చెబుతోంది శ్రీలీల. ఆమెను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది దర్శకుడు రాఘవేంద్రరావు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన వల్లనే తనకు ఈ రేంజ్ లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయని పేర్కొంటుంది శ్రీలీల. తెలుగు సినీరంగంలో తనకు తొలుత అవకాశమిచ్చి తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబు, బాలయ్య, శర్వానంద్, నితిన్ సినిమాలలో  అవకాశం దక్కించుకుంది.  

Also Read :   హీరోయిన్ ల‌య భ‌ర్త ఎవ‌రో తెలుసా..? అమెరికాలోనే ఆయ‌న‌ చాలా ఫేమ‌స్..!

Visitors Are Also Reading