Telugu News » Blog » బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా 1983 వరల్డ్ కప్ హీరో..?

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా 1983 వరల్డ్ కప్ హీరో..?

by Manohar Reddy Mano
Ads
ప్రపంచంలోనే ధనికమైన క్రికెట్ బోర్డుగా పేరు అనేది సంపాదించుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది ఇప్పుడు పెద్దగా చర్చగా మారింది. ఇన్ని రోజులు ఆ పదవిలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. కానీ తాజాగా దాదా పదవి కలం అనేది ముగియడంతో ఆ స్థానంతో పాటుగా బీసీసీఐలో ముఖ్యమైన చాలా స్థానాలకు ఎన్నికలు అనేవి జరగనున్నాయి.
అయితే ఈ సారి బీసీసీఐ ప్రెసిడెంట్ గా అమిత్ షా కొడుకు జై షా అవుతాడు అనే వార్తలు చాలా వచ్చాయి. అలాగే మల్లి గంగూలీనే ప్రెసిడెంట్ గా ఉంటాడు అని కూడా అన్నారు. కానీ తాజాగా ఆ పదవికి పోటీగా కొత్త పేరు అనేది చర్చల్లోకి వచ్చింది. 1983 లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రోజర్ బిన్నీకి ఆ అవకాశం అనేది రానున్నట్లు తెలుస్తుంది.
రోజర్ బిన్నీని బీసీసీఐ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి అన్ని తతంగాలు కూడా పూర్తి అయ్యాయి అని తెలుస్తుంది. ఇక గంగూలీ బీసీసీఐ తరపున ఐసీసీలోకి వెళ్లగా.. జై షా గతంలో మాదిరే బీసీసీఐ సెక్రెటరీగా కొనసాగుతారు అని తెలుస్తుంది. మరి రోజర్ బిన్నీ బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతాడా లేదా అనేది తేలాలి అంటే ఈ నెల 18వ తేదీ సాయంత్రం వరకు ఆగాల్సిందే.