Home » పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారో తెలుసా ?

పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా పండ్ల మార్కెట్ ఎప్పుడూ కూడా సీజనల్ పండ్లతో నిండిపోయి ఉంటుంది. మార్కెట్ లోకి వెళ్లిన సమయంలో అక్కడ రకరకాల పండ్లు మనకు కనిపిస్తుంటాయి. పండు మీద అలాంటి స్టిక్కర్ ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్టిక్కర్లుంటే పండ్ల నాణ్యత బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. మరికొందరూ స్టిక్కర్ ఉన్న పండ్లు ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి దిగుమతి చేసుకుంటారని భావిస్తారు. కాని కొందరేమో స్టిక్కర్ ఉన్న పండును తినవచ్చని అనుకుంటారు. అసలు వీటిలో ఏది కరెక్ట్.. ఎందుకు పండ్లకు స్టిక్కర్ వేస్తారో మనం తెలుసుకుందాం. 

Advertisement

ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల స్టిక్కర్ల వినియోగించడం పై ఓ ట్వీట్ చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పండ్లు, కూరగాయలపై ఇటువంటి స్టిక్కర్లను అతికిస్తారు. పండు నాణ్యత, ధర ఇంకా పండ్లను ఎలా పండించారనే సమాచారం కూడా సూచిస్తుంది. కానీ భారత్ లో మాత్రం వేరే విధంగా ఈ స్టిక్కర్లను వినియోగిస్తారు. చాలా మంది స్టిక్కర్లు మంచివి అనుకుంటారు. కానీ మనదేశంలో స్టిక్కర్ల ఫలితంగా అలాంటి నియమాలు వర్తించవు. స్టిక్కర్ ఉన్న పండ్లను కొనుగోలు చేయడం ద్వారా మీరు మోసపోరు అని భావించడానికి ఎలాంటి కారణం లేదు.

Advertisement

Manam News

ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఈ స్టిక్కర్లను పండ్లు లేదా కూరగాయల నాణ్యతను సూచించడానికి వినియోగిస్తారు. అంతేకాదు.. మీరు అంటించిన ఆ స్టిక్కర్ ని కూడా తినవచ్చు. ప్రప్రంచంలో వివిధ దేశాల్లో పండుపై అంటించిన స్టిక్కర్ ని తినడం వల్ల శరీరానికి పెద్దగా హాని కలగదు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ స్టిక్కర్ ని తినమని సిఫారసు చేయడం లేదు. ఎఫ్డీఏ ప్రకారం.. ఈ స్టిక్కర్లు పండ్లు, కూరగాయలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని సూచిస్తాయి. స్టిక్కర్లు తినదగినవా ? కాదా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.  భారత్ లో పండ్ల ఉత్పత్తిలోని లోపాలను దాచిపెట్టడానికి మనదేశంలో పండ్లపై స్టిక్కర్లను అతికిస్తున్నారు. పండ్లకు స్టిక్కర్లను అంటించడానికి గమ్ లేదా జిగురును ఉపయోగిస్తారు. అందుకోసం స్టిక్కర్ ఉన్న పండ్లను తినే ముందు జాగ్రత్తలు పాటించాలి. ఎట్టి పరిస్థితిలోనూ స్టిక్కర్ ని తినకూడదు. గమ్ లేదా జిగురు ఉన్నందున వీటిని తింటే అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశముంది. 

Also Read :  ఎన్టీఆర్ నిర్ణయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒప్పుకుంటాడా ?

Visitors Are Also Reading