Home » ఎన్టీఆర్ నిర్ణయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒప్పుకుంటాడా ?

ఎన్టీఆర్ నిర్ణయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒప్పుకుంటాడా ?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇందులో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి. ఆస్కార్ అవార్డు కూడా దక్కుతుందని హాలీవుడ్ ప్రముఖులు చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అరవింద మేత సినిమా తరువాత చాలా ఏళ్ల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ సమయం తీసుకున్నాడు. ఆ తరువాత ప్రస్తుతం చాలా నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది.

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా కొరటాల శివ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కొరటాల శివ సినిమా తరువాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఈ తరుణంలో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టేట్టు కనిపిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ మూవీ సెట్స్ మీదికి రానుంది. 

Advertisement

Also Read :  అందుకే తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నా….దిల్ రాజు ఓపెన్ కామెంట్స్….!

Manam News

వాస్తవానికి 2023 సమ్మర్ లోపే కొరటాల సినిమా షూటింగ్ పూర్తి అవ్వాలి. కానీ కొరటాల శివ సినిమా ఆలస్యం కావడంతో సమ్మర్ లోపు  పూర్తి అయ్యేటట్టు మాత్రం కనిపించడం లేదు. త్వరలోనే  కొరటాల సినిమా పట్టాలెక్కనుంది.  కొరటాల శివ సినిమా పూర్తయిన తరువాత ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కనుంది. అయితే వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా కూడా పూర్తవ్వాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట. కానీ ప్రశాంత్ నీల్ అందుకు సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది మాత్రం తెలియదు. మరి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం పై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. 

Also Read :  అత్తారింటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఎగబడ్డ జనం ..!

Visitors Are Also Reading