Home » ఆస్కార్ కోసం రాజమౌళి ఖర్చుపై తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారంటే..?

ఆస్కార్ కోసం రాజమౌళి ఖర్చుపై తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారంటే..?

by Anji
Ad

సాధారణంగా ఆస్కార్ అవార్డుకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ రంగానికి చెందిన వారు ఎవరైనా ఈ అవార్డు గెలిస్తే అతని పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగుతుంటుంది. అలాంటి అవార్డుకి రాజమౌళి RRR సెలెక్ట్ కావడం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ పోటీ పడుతూ ఉంది. ఇదే కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. దీంతో కచ్చితంగా  RRR చిత్రం ఆస్కార్ గెలుచుకునే పరిస్థితి ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read :   ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…

Advertisement

Advertisement

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ఈ చిత్రం కోసం ప్రమోషన్ కార్యక్రమాలకు ఫ్లైట్ ఛార్జీలకు దాదాపు రూ.80 కోట్లకు పైగా రాజమౌళి టీమ్ ఖర్చు చేయడం జరిగిందని తమ్మారెడ్డి భరద్వాజ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేసారు. RRR చిత్రం రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేసి నిర్మించారు. ఆస్కార్ అవార్డు ప్రమోషన్స్ కార్యక్రమాల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తూ.. ఫ్లైట్ల మీద తిరుగుతున్నారని.. అవే ఫ్లైట్ ఖర్చులు మాకు ఇచ్చినట్టయితే.. దాదాపు 8 నుంచి 10 సినిమాల వరకు తీసి వాళ్ల మొహం మీద కొడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read :  జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

దీంతో తమ్మారెడ్డి భరధ్వాజ చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీలోనే పెను సంచలనంగా మారాయి. హైదరాబాద్ రవీంద్ర భారతి కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 13వ తేదీ వరకు జరుగనుంది. ఈ సమయంలో RRR ఆస్కార్ అవార్డు గెలవాలని సినీ ప్రేమికులు కోరుతున్నారు. RRR ఆస్కార్ గెలిచినట్టయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుందని చెబుతున్నారు.

Also Read :  చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?

Visitors Are Also Reading