Home » ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…

ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…

by Bunty
Published: Last Updated on
Ad

తెలుగు ఇండస్ట్రీలోనే తన అద్భుతమైన నటనతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా పేరు తెచ్చుకున్నారు అన్న ఎన్టీఆర్. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే కళాశక్తి ఆయన సొంతం. ఆయన పౌరాణిక సినిమాలు చేశాడు అంటే ఆ పాత్రకి కొత్త అందం వస్తుంది. రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రలు చూస్తే నిజంగానే దేవుడు కొలువై వచ్చాడా అని అనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్.

READ ALSO : “రైటర్ పద్మభూషణ్” ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే !

Advertisement

ఇప్పటివరకు ఆయనకు సాటిగా నటించిన నటుడు అయితే లేరని చెప్పవచ్చు, అలాంటి పౌరాణిక చిత్రాల్లో దాన వీరశూరకర్ణ చాలా స్పెషల్. 1977 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఎన్టీఆర్ వహించారు. ఇందులో దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడిగా విభిన్న పాత్రలో నటించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, హరికృష్ణ కూడా ఇందులో నటించారు.

Advertisement

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

కానీ ఈ సినిమా అప్పట్లో రికార్డు స్థాయిలో వసూలు చేసే సినిమా ఇండస్ట్రీలోని అత్యుత్తమ చిత్రంగా పేరు పొందింది. అప్పట్లో ఈ సినిమాకు 20 లక్షల బడ్జెట్ పెడితే దానికి 15 రేట్లు ఎక్కువగా లాభాలు తీసుకువచ్చి.. మూడు కోట్లకు పైగా వసూలు చేసింది. నాలుగు గంటలకు పైగా నిడివితో 25 థియేటర్స్ లో తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో పెద్ద రికార్డు సృష్టించింది. సినిమా ఇంత సమయం ఉన్నా కానీ ప్రేక్షకులకు ఎక్కడా కూడా విసుగు లేకుండా ఎన్టీఆర్ తన నటన ప్రతిభతో అందరినీ మెస్మరైజ్ చేశారని చెప్పవచ్చు. ఈ సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది.

READ ALSO : పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?

Visitors Are Also Reading