Home » జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

by Bunty

 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ యాంకర్లలో సుమ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఆమె మలయాళీ అయినా కానీ తెలుగులో స్పష్టంగా అచ్చతెలుగు అమ్మాయిల అందరితో కలిసిపోతుంది. ఓవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే మరోవైపు ఫంక్షన్లు ఇతర షోలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. అయితే సుమ కొన్ని రోజుల క్రితం ఆమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన విధానంపై మాత్రం ఎన్టీఆర్ చాలా సీరియస్ గా చూడడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

READ ALSO : ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…

ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాము అని అక్కడ మాట్లాడడంతో ఎన్టీఆర్ చాలా సీరియస్ అయిపోయాడు. ఫ్యాన్స్ అడక్కపోయినా కూడా నువ్వు చెప్పేలా ఉన్నావ్ అంటూ చాలా కోపంగా చూడడంతో అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో వైరల్ అయినప్పుడు సుమ పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ వెంటనే తన పని తాను సైలెంట్ గా చేసుకుంది. ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత ఆమె ఎన్టీఆర్ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చినట్లుగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

READ ALSO : పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?

 

ఇటీవల వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు ప్రెస్ మీట్ లో పాల్గొన్న సుమ ఊహించిన విధంగా ఒక కామెంట్ చేసింది. రానా నాయుడు సినిమాలో వెంకి కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. కాబట్టి కాస్త విలన్ తరహాలో సీరియస్ లుక్స్ లో చూడాల్సిందిగా సుమ రిక్వెస్ట్ చేసింది. అయితే వెంకీ కూడా అలానే సీరియస్ గా చూశాడు. ఈ మాత్రం చాలు ఇక రేపటికి చాలా థంబ్ నెయిల్స్ వస్తాయి. అందరూ నన్ను ఇలానే చూస్తున్నారు ఈమధ్య అంటూ ఆమె ఎన్టీఆర్ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చినట్లు అర్థమయిపోయింది. ఇక ఆ వీడియో పై సోషల్ మీడియాలో ఓ వర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి కొంత మంది సుమకు సపోర్ట్ కూడా చేస్తున్నారు.

READ ALSO : భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?

Visitors Are Also Reading