Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకున్న ఫ‌లితం వ‌స్తుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకున్న ఫ‌లితం వ‌స్తుంది

by Anji

రాశి ఫ‌లాలు డైలీ చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 14.08.2022 నుండి 20.08.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఓర్పుతో ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాలి. కాలం అనుకూలంగా లేదు. ఉద్యోగంలో సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించాలి. శాంత చిత్తంతో నిర్ణ‌యాలు తీసుకోవాలి. స‌ర్దుకుపోయే ధోర‌ణి అవ‌స‌రం. త‌గినంత మాన‌వ ప్ర‌య‌త్నం చేయండి. కార్య‌సిద్ధి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫ‌లితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌.

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య‌కార్యాల్లో అనుకున్న ఫ‌లిత‌ముంటుంది. అనేక లాభాలు ఉంటాయి. ధ‌ర్మ‌బ‌ద్ధంగా ప‌ని చేయండి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఆశీస్సుల‌తో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇంట్లో వారి సూచ‌న‌లు విజ‌యాన్ని ఇస్తాయి. కీర్తి పెరుగుతుంది. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఆర్థిక అంశాలు బాగుంటాయి. ప్ర‌తి అడుగూ ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియ‌ని ఆటంకాలు ఉంటాయి. భ‌విష్య‌త్ దృష్టిలో పెట్టుకుని ప‌ని చేయాలి. స‌హ‌నాన్ని ప‌రీక్షించే కాలం ఇది. శాంత స్వ‌భావంతో ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ల‌క్ష్యాన్ని సాధించాలి. మిత్రుల స‌ల‌హా అవ‌స‌రం. ప‌నుల‌ను వాయిదా వేయ‌వ‌ద్దు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

అంతా శుభం జ‌రుగుతుంది. స‌కాలంలో ప‌నుల‌ను పూర్తి చేయండి. ఉద్యోగంలో అధికారుల ప్ర‌శంస‌లుంటాయి. ఇంట్లో శుభ‌కార్యం జ‌రుగుతుంది. వ్యాపారం బ్ర‌హ్మాండంగా ఉంటుంది. ఎటు చూసినా విజ‌య‌మే గోచ‌రిస్తోంది. నూత‌న వ‌స్తు వ‌స్త్ర ప్రాప్తి సూచితం. గృహ వాహ‌నాది యోగాలు ఉన్నాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

మ‌నోబ‌లంత ప‌ని ప్రారంభించండి. విజ‌యం ల‌భిస్తుంది. చంచ‌ల నిర్ణ‌యాలు వ‌ద్దు. ఆత్మీయుల స‌ల‌హా తీసుకోవాలి. ప‌నిని మ‌ధ్య‌లో ఆప‌వ‌ద్దు. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో రానున్న ఆప‌ద‌ను త‌ప్పించుకోవ‌చ్చు. దృఢ సంక‌ల్పం, శాంత స్వ‌భావం ముందుకు న‌డిపిస్తాయి. అపార్థాల‌కు తావివ్వ‌కండి. కాలం మిశ్ర‌మంగా ఉంది.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఉత్సాహంగా ప‌ని చేయండి. ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి. ధ‌న‌యోగం ఉంది. ఆవేశ‌ప‌రిచే వారు ఉంటారు. మీ మ‌నోధ‌ర్మాన్ని అనుస‌రించి ముందుకు వెళ్లండి. వ్యాపారంలో శ్ర‌మ గోచ‌రిస్తోంది. స్వ‌ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకోండి. చిక్కులు తొల‌గుతాయి. కుటుంబం ఆనందంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగ‌వ్యాపారాల అద్భుతంగా ఉంటాయి. గుర్తింపు గౌర‌వాలు ల‌భిస్తాయి. జీవితాశ‌యం నెర‌వేరుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. క్ర‌మ క్ర‌మంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. సంకోచించ‌కుండా నిర్ణ‌యాలు తీసుకోండి. వివాదాల‌కు ఆస్కార‌ముంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగం బాగుంటుంది. ప‌నులు పూర్తి అవుతాయి. ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. వ్య‌యం త‌గ్గించి సంప‌ద పెంచుకునే మార్గాల‌ను అన్వేషించాలి. నూత‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయి. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌వ్వ‌ద్దు. వారం మ‌ధ్య‌లో ఒక ఆప‌ద నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. మిత్రుల స‌హ‌కారంతో ఒక ప‌ని పూర్తి అవుతుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుతారు. ఉద్యోగంలో మీ ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించండి. ఫ‌లితం అనుకూలంగా ఉంటుంది. స్థిర‌త్వం ల‌భిస్తుంది. బంధు, మిత్రుల ప్రశంస‌లుంటాయి. అపోహ‌లు తొల‌గుతాయి. వ్యాపారం అనుకూలం. ఓర్పుతో వ్య‌వ‌హ‌రిస్తే ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మంచి భ‌విష్య‌త్ కోసం క‌ష్ట‌ప‌డాలి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ప‌రీక్ష కాలం ఇది. ఆవేశం ప‌నికి రాదు. మితంగా మాట్లాడాలి. పొర‌పాటు జ‌రిగితే న‌ష్టం తీవ్రంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. నింద ఆరోప‌ణ‌లు చేసే వారు ఉన్నారు. ఉద్యోగంలో ఒత్తిడి పెర‌గ‌వ‌చ్చు. శాంతంగా ఉండాలి. వృథా వ్య‌యం పెర‌గ‌కుండా చూసుకోవాలి. త్వ‌ర‌లో మంచి భ‌విష్య‌త్ సిద్ధిస్తుంది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగం బాగుంటుంది. ధైర్యంగా మంచి ఫ‌లితాన్ని సాధిస్తారు. కాలం స‌హ‌క‌రిస్తోంది. వ్యాపారంలోనూ అభివృద్ధిని సాధిస్తారు. ప‌ట్టుద‌ల‌తో బంగారు భ‌విష్య‌త్ ను సొంతం చేసుకోగ‌ల‌రు. ఈర్ష్యాప‌రుల మాట‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు. మీ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించండి. కుటుంబ ప‌రంగా క‌లిసి వ‌స్తుంది. ఓ శుభ‌వార్త వింటారు.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

వీరికి అంతా మంచే జ‌రుగుతుంది. ఎదురు చూస్తున్న ప‌ని పూర్తి అవుతుంది. వ్యాపారం బ్ర‌హ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు సాధిస్తారు. కాలం వృథా కాకుండా చూసుకోవాలి. ధ‌న‌లాబం సూచితం. చెడు ఆలోచ‌న‌లు రానీయ‌కూడ‌దు. స‌మిష్టి నిర్ణ‌యాలు మేలు చేస్తాయి. ఇష్ట‌కార్యాలు పూర్తి చేస్తారు.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ధ‌న‌లాభం క‌లుగుతుంది

Visitors Are Also Reading