Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ధ‌న‌లాభం క‌లుగుతుంది

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ధ‌న‌లాభం క‌లుగుతుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 14.08.2022: మేషం

ఉద్యోగ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండ‌దు. త‌ల‌చిన ప‌నులు పూర్తి అవుతాయి. శ్ర‌మ అధికం, ఫ‌లితం స్వ‌ల్పం అన్న‌ట్టుగా ఉంటుంది. నిరుద్యోగుల‌కు చిన్న‌పాటి ఉద్యోగం ల‌భించ‌వ‌చ్చు. చిన్ననాటి స్నేహితుల‌తో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ఆర్థికంగా ధ‌న లాభం క‌లుగుతుంది. ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డ‌మే కాకుండా.. ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించే అవ‌కాశ‌ముంది. ప‌లుకుబ‌డి పెరుగుతుంది. ఉద్యోగంలో ప‌ని ఒత్తిడి పెరిగిన‌ప్ప‌టికీ స‌మ‌ర్థ‌వంతంగా ల‌క్ష్యాలు, బాధ్య‌త‌లు పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మీ శ్ర‌మ ఫ‌లిస్తుంది. స‌మ‌య‌స్ఫూర్తితో ఆటంకాలు తొల‌గిపోతాయి. కీల‌క విష‌యాల్లో చంచ‌ల స్వ‌భావాన్ని రానీయ‌కండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన ప‌నుల‌ను పూర్తి చేస్తారు. బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. మ‌న‌స్సు చెప్పింది చేయండి. శుభం జ‌రుగుతుంది. ఒక శుభ‌వార్త మ‌నోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగాల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తారు. బుద్ధిబ‌లం బాగుంటుంది. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ఓ శుభ‌వార్త వింటారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌యాణాలు లాభ‌ప‌డ‌తాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

సంపూర్ణ మ‌నోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. ఒక వార్త బాధ క‌లిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయకండి. శ‌త్రువుల విష‌యంలో ఆచితూచి అడుగువేయాలి.

Today rashi phalau in telugu : తుల

అధికారుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క‌మైన విష‌యాల‌లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. ఆర్థికంగా మిశ్ర‌మ కాలం. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేప‌ట్టే ప‌నుల్లో శుభం క‌లుగుతుంది. బంధు, మిత్రుల స‌హ‌కారం ఉంటుంది. ఇష్ట‌దైవ ప్రార్థ‌న మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. స‌మ‌యానికి నిద్రహారాలు అవ‌స‌రం. ఆర్థిక‌ప‌రంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంబించిన ప‌నుల్లో ఆటంకాల‌ను అదిగ‌మిస్తారు. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కుటుంబ స‌భ్యుల‌తో ఒక శుభ‌వార్త‌ను పంచుకుంటారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  మీనం

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్తి అవుతాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Visitors Are Also Reading