Telugu News » Blog » గుత్తా జ్వాల – విష్ణు విశాల్ జంట విడాకులు..?

గుత్తా జ్వాల – విష్ణు విశాల్ జంట విడాకులు..?

by Bunty
Ads

సెలబ్రిటీలు విడాకులు, బ్రేకప్ లు చేసుకోవడం కామన్ అయిపోయింది. తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిని గుత్తాజ్వాల కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల విష్ణు చేసిన ట్వీటే అందుకు కారణం. నేను ఎంతో ప్రయత్నించాను, కానీ విఫలం అవుతూనే ఉన్నాను. మరేం పర్వాలేదు, దాని నుంచి గుణపాటాన్ని నేర్చుకున్నాను. అయినా అది పరాజయం కాదు, పూర్తిగా నా తప్పే! అది ఒక మోసపూరిత ద్రోహం, అంటూ లైఫ్ లెస్సన్స్ హ్యాష్ ట్యాబ్ జత చేశాడు.

Advertisement

READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!

Advertisement

ఇది చూసిన నెటిజన్లు విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకారు లేపారు. తాజాగా ఈ వ్యవహారంపై విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం నేను చేసిన ట్వీట్ ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు, కేవలం వృత్తిగత జీవితం గురించే ట్విట్ చేశాను. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో నమ్మకం. ఒకరికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే నమ్మకం.

READ ALSO : Bank Holidays April 2023 : వచ్చే నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్… పూర్తి వివరాలు ఇవే…

భార్యకు విడాకులు.. హీరో విష్ణు ఏమన్నారంటే..! - Tolivelugu తొలివెలుగు

ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం మరి అంత కఠినంగా ఉండకూడదు, అని మాత్రమే దాని అర్థం అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్ తో విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టాడు హీరో. ఇకపోతే విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

You may also like