Home » RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!

RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!

by Bunty

 

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. నిన్న ఉదయం టైటిల్ ను రివిల్ చేయగా, దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  నిన్న సాయంత్రం దాన్ని రెట్టింపు చేస్తూ ఫస్ట్ లుక్ ను కూడా రివిల్ చేశారు.

READ ALSO : IPL 2023 : కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో తీస్తున్న ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. 42 సెకన్ల వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదే టైటిల్ పెట్టడం వెనక ఓ కారణం కూడా ఉంది. RRR టైటిల్ సింపుల్ ఇంగ్లీష్ లెటర్స్ తో ఉండటం వల్ల అన్ని భాషల వాళ్లకు ఈజీగా అర్థమయిపోయింది.

READ ALSO : IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!

RC15 "Game Changer" First Look of Ram Charan | Kiara Advani | Shankar | Raju | Thaman S - YouTube

అందుకే రామ్ చరణ్-శంకర్ సినిమాకు గేమ్ చేంజర్ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రాంచరణ్ కొత్త సినిమా టైటిల్ వీడియోని బట్టి చూస్తుంటే పూర్తిస్థాయి ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో తీస్తున్నారు. పాలిటిక్స్ ని మొత్తం మార్చేసే గేమ్ చేంజర్ గా కనిపించబోతున్నాడు. దీన్ని బట్టి పాన్ ఇండియా లెవెల్లో కాదు ఏకంగా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రెడీ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇందులో చరణ్, తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Visitors Are Also Reading