Home » Bank Holidays April 2023 : వచ్చే నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్… పూర్తి వివరాలు ఇవే…

Bank Holidays April 2023 : వచ్చే నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్… పూర్తి వివరాలు ఇవే…

by Bunty

బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పండుగలు, వారాంత సెలవులతో కలిపి ఏప్రిల్ నెలలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు సకాలంలో పూర్తి చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. ఏప్రిల్ నెలలో 1, 2, 4, 5, 7, 8, 9, 14, 15, 16, 18, 21, 22, 23, 30 తేదీలలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. సెలవు దినాల్లో కూడా ఏటీఎంలు, నగదు డిపాజిట్లు, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యధావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. బ్యాంకు కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చ్ 2023లో ప్రకటించిన బ్యాంకు సెలవుల లిస్ట్ ఇదే..

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

 

ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా ఇదే

ఏప్రిల్ 1వ తేదీన నూతన ఆర్థిక ఏడాది ప్రారంభమవుతున్న కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం
ఏప్రిల్ 4వ తేదీన మహావీర్ జయంతి
ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 7వ తేదీన గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 8వ తేదీన రెండో శనివారం
ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం
ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

READ ALSO : IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!

ఏప్రిల్ 15వ తేదీన విషూ, బోహాగ్, బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తలా, గువాహటి, కొచ్చి, కోల్కతా, షిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16వ తేదీన ఆదివారం
ఏప్రిల్ 18వ తేదీన షాబ్ ఈ కబర్ కారణంగా జమ్మూ అండ్ శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 21వ తేదీన ఈద్ ఉల్ ఫితర్ పండగ కావడంతో అగర్తలా, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 22వ తేదీన నాలుగో శనివారం
ఏప్రిల్ 23వ తేదీన ఆదివారం
ఏప్రిల్ 30వ తేదీన ఆదివారం

READ ALSO : IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !

Visitors Are Also Reading