Home » ఏసీ వేసినప్పుడు ఇలా చేస్తే.. కరెంట్ బిల్లుతో టెన్షన్ ఉండదు..!

ఏసీ వేసినప్పుడు ఇలా చేస్తే.. కరెంట్ బిల్లుతో టెన్షన్ ఉండదు..!

by Sravya
Ad

వేసవి వచ్చినప్పుడు వేడిని తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఏసీ ని వాడుతూ ఉంటారు. కచ్చితంగా ఏసీ గురించి వేసవి వస్తే అందరికీ గుర్తొస్తుంది. ఒక సారి సర్వీసింగ్ చేయించుకోవడం క్లీన్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఏసి వేసుకుని నిద్రపోతే హాయిగా నిద్ర పడుతుంది. ఈ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఏసి ఎక్కువసేపు వేసుకుంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని చాలా మంది భయపడతారు. ఏసీ కొన్నా కరెంట్ బిల్లుని ఆదా చేసుకోవాలని పొదుపుగా వాడుతూ ఉంటారు. అప్పుడప్పుడే వేసుకుంటూ ఉంటారు.

Advertisement

నిజానికి చాలా మందికి ఏసీ ని సరిగా ఎలా ఉపయోగించాలి అనే విషయం తెలీదు. ఏసీ బిల్లు ఏసీ పనితీరు రెండు మన వినియోగాన్ని బట్టి ఉంటాయి. మనం ఏసీ ని సక్రమంగా వాడితే బిల్లు కూడా తక్కువగా ఉంటుంది. ఏసీ ఏళ్ల తరబడి బాగా నడుస్తుంది. సరైన టెంపరేచర్ లో ఏసీ ని ఉంచితే బిల్లు కూడా తగ్గుతుంది. ఎయిర్ కండిషనర్ పై ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ తగ్గిస్తే అది విద్యుత్ బిల్లుని 6% పెంచుతుందని తెలుసుకోవాలి.

Advertisement

Also read:

Also read:

ఇలాంటి పరిస్థితుల్లో మీరు గదిని త్వరగా చల్లబరచడానికి 18 లేదా 19 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎయిర్ కండిషనర్ ని సెట్ చేస్తే బిల్లు బాగా ఎక్కువ వస్తుంది అదే మీరు 23 లేదా 25 డిగ్రీల సెల్సియస్ మధ్య పెట్టుకున్నట్లయితే బిల్లు బాగా తక్కువ వస్తుంది. లోడ్ పెరగకుండా చూస్తుంది ఏసీ ని ఆన్ చేసినప్పుడు గదిలోని ఫ్యాన్ ని ఆన్ చేయొచ్చు తద్వారా ఏసీ గాలి గది చుట్టూ వ్యాపిస్తుంది దీంతో ఎక్కువసేపు ఏసి నడపాల్సిన అవసరం ఉండదు.

తెలుగు న్యూస్ కోసం ఇలా చెయ్యండి!

Visitors Are Also Reading