Home » Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

by Bunty
Ad

తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శంచుకునే భక్తులకు అదిరిపోయే శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను ఏప్రిల్ 8న ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వయా గుంటూరు మీదుగా ఈ రైలు నడపనున్నట్లు పేర్కొన్నారు.

READ ALSO : IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!

Advertisement

అంటే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకోనుంది.అయితే ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగనుందని విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయిన్ రన్ పూర్తయింది. ఈ రైలు ప్రారంభమైతే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రస్తుతం 12 గంటలుగా ప్రయాణ సమయం ఆరున్నర గంటల నుంచి 7 గంటలకు తగ్గనుంది.

Advertisement

Tirupati-Secunderabad Vande Bharat Express train likely to hit tracks from April 8 | Amaravati News - Times of India

ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్ప్రెస్.. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతుంది. అదే వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 140-150 కిలోమీటర్ల వేగంతో… కేవలం 6:30 గంటల్లోనే తిరుపతికి చేరుకుంటుందట. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు టికెట్ రేటు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది. జిఎస్టి, తత్కాల్ సర్ చార్జీతో కలిపి చైర్ కార్ టికె ట్ ధర రూ.1150 నుంచి ప్రారంభం కానుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2000 దాటవచ్చని సమాచారం. దీనిపై త్వరలోనే క్లా రిటీ రానుంది.

READ ALSO : IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !

Visitors Are Also Reading