Home » ఈ సెంచరీ వారికే అంకితం..!

ఈ సెంచరీ వారికే అంకితం..!

by Azhar
Ad

అభిమానుల కలను నెరవేరుస్తూ 1020 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ ఈరోజు సెంచరీ అనేది చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లోని సూపర్ 4లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 122 పరుగులతో కోహ్లీ రాణించాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్ అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఈ సెంచరీని తన భార్య, కూతురికి అంకితం చేసాడు.

Advertisement

అయితే ఈరోజు మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. నేను టీ20 లో సెంచరీ చేస్తాను అని అనుకోలేదు. అయితే ఈరోజు సెంచరీ చేయడంతో కొంత షాకింగ్ పైగా అనిపించింది. అయితే నేను సెంచరీ చేయగా చాలా రోజులు అవుతుంది. ఈ క్రమంలో అందరూ నా ఈ 71వ సెంచరీ గురించి మాట్లాడారు. నేను దానిని అందుకోలేకపోతున్నాను అని కామెంట్స్ చేసారు. నాకు ఇప్పుడు 34 ఏళ్ళు నిండబోతున్నాయి.

Advertisement

అందుకే నేను చేయాల్సిన 71వ సెంచరీ గురించి కాకుండా చేసిన 70 సెంచరీల గురించి ఆలోచించాను. ఇక నేను ఈ సెంచరీని నాకు అన్ని సమయాల్లో తోడుగా నిలిచినా వ్యక్తికి అంకితం చేయాలి అనుకుంటున్నాను. అనుష్క ఇది నీకోసమే.. వామిక కోసం కూడా. నేను ఈ టోర్నీకి ముందు తీసుకున్న బ్రేక్ అనేది నాకు ఉపయోగపడింది. నేను ఎంత అలిసిపోయానో నాకు అర్ధం అయ్యింది. అందుకే తిరిగి వచ్చాక.. నేను ఎక్కువ సేపు నెట్స్ లో ప్రాక్టీస్ అనేది చేయగలిగాను అని విరాట్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

టీమిండియా ప్లేయర్స్ కు వార్నింగ్..!

ఒక్క సెంచరీతో విరాట్ రికార్డుల పర్వం..!

Visitors Are Also Reading