Home » ఒక్క సెంచరీతో విరాట్ రికార్డుల పర్వం..!

ఒక్క సెంచరీతో విరాట్ రికార్డుల పర్వం..!

by Azhar
Ad
విరాట్ కోహ్లీ సెంచరీ కల అనేది ఈరోజు నెరవేరింది. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో ఇండియా మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 1020 రోజుల తర్వాత సెంచరీ అనేది చేసాడు. ఇక ఈ సెంచరీతో కోహ్లీ పలు రికార్డులను నెలకొల్పాడు.
అయితే విరాట్ కు ఇది మొత్తంగా 71వ సెంచరీ. దాంతో క్రికెట్ చరిత్రలో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ 100 తర్వాత అత్యధికంగా చేసిన ఆటగాడిగా విరాట్ రెండో స్థానం లో నిలిచాడు. అలాగే ఈ సెంచరీతో టీ20 అత్యధికసార్లు 50+ పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ లెక్కలో ఇన్నిరోజులు కోహ్లీ, రోహిత్ 32 సార్లు ఈ ఫిట్ ను సాధించి సమంగా నిలవగా.. ఈరోజు కోహ్లీ 33 సార్లు ఈ ఫిట్ అందుకున్న ఆటగాడిగా మొదటి స్థానంలోకి వెళ్ళాడు.
ఇక ఈ సెంచరీ అనేది కోహ్లీ టీ20 మ్యాచ్ లో మొదటిది. ఈ మ్యాచ్ ఓ కోహ్లీ మొత్తం 122 పరుగులు చేసాడు. దాంతో ఇండియా తరపున టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ స్థానంలో ఇన్ని రోజు భారత కెప్టెన్ రోహిత్ శర్మ 119 పరుగులతో ఉండేవాడు. కానీ ఈరోజు రోహిత్ కంటే మూడు పరుగులు ఎక్కువ చేసి మొదటి స్థానంకు వచ్చేసాడు.

Advertisement

Visitors Are Also Reading