Home » మొదటి భారతీయుడిగా మరో ఘనత సాధించబోతున్న కోహ్లీ..!

మొదటి భారతీయుడిగా మరో ఘనత సాధించబోతున్న కోహ్లీ..!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నో ఘనతలు అనేవి అందుకున్నాడు. ఎక్కువ రికార్డులను మొదటి భారతీయుడిగా క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. ఇది సాధిస్తున్న మొదటి భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే అవుతున్నాడు. అదేంటంటే.. మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్ లను పూర్తి చేస్తున్న ఆటగాడిగా విరాట్ నిలుస్తున్నాడు.

Advertisement

అయితే కోహ్లీ ఎప్పుడో 2012 లోనే వన్డేలలో 100 మ్యాచ్ లను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ ఏడాదే శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 100వ టెస్ట్ మ్యాచ్ అనేది ఆడేసాడు. అలాగే టీ20 లలో ఇప్పటివరకు కోహ్లీ 99 మ్యాచ్ లు ఆడాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటన తర్వాత కోహ్లీ రెస్ట్ కోసం జట్టుకు ధుమరం కావడంతో తన 100వ టీ20 అనేది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆసియా కప్ కోసం యూఏఈ వెళ్లిన భారత జట్టులో కోహ్లీ కూడా ఉన్నాడు.

Advertisement

కాబట్టి ఈ టోర్నీలో ఎల్లుండి పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఆడితే 100 టీ20 మ్యాచ్ లు పూర్తి చేసుకుంటాడు. అలా జరిగితే మూడు ఫార్మాట్ లలో 100 మ్యాచ్ లు ఆడిన ఏకైక భారత ఆటగాడిగా విరాట్ నిలుస్తాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ మాత్రమే ఈ ఘనత అందుకున్నాడు. కాబట్టి కోహ్లీ రెండవ ఆటగాడు అవుతాడు.

ఇవి కూడా చదవండి :

గాయంతో ఆసియా కప్ కు రోహిత్ దూరం కానున్నాడా..?

కోహ్లీ ఫామ్ పై షాహిన్ కామెంట్స్..!

Visitors Are Also Reading