Home » గాయంతో ఆసియా కప్ కు రోహిత్ దూరం కానున్నాడా..?

గాయంతో ఆసియా కప్ కు రోహిత్ దూరం కానున్నాడా..?

by Azhar
Ad
విరాట్ కోహ్లీ టీం ఇండియా కెప్టెన్సీని వదిలేసిన తర్వాత మూడు ఫార్మాట్లలో ఆ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేస్తున్నాడు. అయితే కెప్టెన్ అంటే జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. కానీ రోహిత్ మాత్రం కెప్టెన్ అయిన తర్వాత విజయాలు సాధిస్తున్న.. జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. రెస్ట్, గాయం అనే పేరుతో జట్టుకు ఎక్కువగా దూరం అవుతున్నాడు అనేది అందరికి తెలిసిందే.
ఆ కారణంగానే ఈ ఒక్క ఏడాదే మన భారత జట్టుకు 8 మంది కెప్టెన్లుగా వ్యవరించారు. ఇక టీం ఇండియా చివరగా వెళ్లినా జింబాంబ్వే పర్యటన నుండి కూడా రోహిత్ కు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. అందుకు కారణం ఇప్పుడు ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ కు అందుబాటులో ఉండాలని. ఎందుకంటే రోహిత్ మ్యాచ్ ఆడితే ఎక్కువగా గాయాల బారిన పడుతాడు అని అందరికి తెలుసు. ఇంత చేసిన రోహిత్ ఇప్పుడు మళ్ళీ గాయపడినట్లు తెలుస్తుంది.
అయితే రేపటి నుండి ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ లో భాగంగా ప్రతి జట్టు కెప్టెన్, హెడ్ కోచ్ మీడియా సమావేశంలో పాల్గొంటారు. కానీ మన జాతు తరపున కెప్టెన్ రోహిత్ స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. అందుకు కారణం ప్రాక్టీస్ లో రోహిత్ మళ్ళీ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజం అయితే ఎల్లుండి పాకిస్థాన్ తో జరగనున్న  మ్యాచ్ కు దూరం కావడం ఖాయం.

Advertisement

Visitors Are Also Reading