Home » ఆర్జీవీ సినిమా “వ్యూహం”లో విలన్ ఎవరో తెలుసా? మెగా ఫాన్స్ తో చిచ్చు మొదలు కాబోతోందా?

ఆర్జీవీ సినిమా “వ్యూహం”లో విలన్ ఎవరో తెలుసా? మెగా ఫాన్స్ తో చిచ్చు మొదలు కాబోతోందా?

by Srilakshmi Bharathi
Ad

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో 25 రోజుల్లో విడుదల కాబోతోంది. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా కొనసాగిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పొలిటికల్ సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. గతంతో పోలిస్తే రామ్ గోపాల్ వర్మ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన తీస్తున్న వ్యూహం సినిమా గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది.

Advertisement

ఈ సినిమాలో చంద్రబాబు నాయుడుని విలన్ గా చూపిస్తారు అని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ ని విలన్ గా చూపించే అవకాశం కనిపిస్తోంది. దీనితో మెగా ఫాన్స్ తో మరో వివాదం మొదలవబోతోందా అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా వర్మకి చాలా ఎక్కువగానే రెమ్యూనరేషన్ ముడుతోందట. టీడీపీ జనసేన పొత్తు బలపడుతున్న నేపథ్యంలో జనసేనని బలహీనం చేయడం కోసం వైసీపీ ఎత్తు వేస్తోందని తెలుస్తోంది.

Advertisement

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్లే జనసేన వచ్చిందని.. పవన్ పొలిటికల్ లైఫ్ లో విమర్శలపాలవుతోంది చిరు వల్లే అని ఈ సినిమా ద్వారా ప్రచారం చెయ్యాలని వైసీపీ భావిస్తోందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా మెగా ఫాన్స్ కు పిచ్చ చిరాకు, కోపం తెప్పించే విధంగా ఉంటుందట. ఈ సినిమా సక్సెస్ సాధించినా లేకున్నా రిలీజ్ చేయడం మాత్రం జరుగుతుంది. వైసీపీ సక్సెస్ అయ్యే దిశగానే రామ్ గోపాల్ వర్మ తన ప్రయత్నాలను చేస్తున్నారని తెలుస్తోంది. అసలు వర్మ ఇకపై పొలిటికల్ సినిమాలు తీయనని అన్నారు. అయితే.. ఆయన మాటలను నమ్మడం జనాలు ఎప్పుడో మానేశారు. ఇకపై ఆయన ఎలాంటి సినిమాలు తీస్తారో వేచి చూడాలి.

మరిన్ని..

నాగార్జున విషయంలో అప్పుడు టబు..ఇప్పుడు అనుష్క అలా చేశారా..!

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్యను చూశారా..? ఆ ఈవెంట్‌ లో స్పెషల్ అట్రాక్షన్..!

వ్యూహం చిత్రంలో వై.ఎస్.భారతి పాత్రలో నటించింది ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading