Home » ఆ స్పీడ్ అనేది నాకు సహజంగానే వచ్చింది..!

ఆ స్పీడ్ అనేది నాకు సహజంగానే వచ్చింది..!

by Azhar
ప్రస్తుతం ఐపీఎల్ లో బాగా వినిపిస్తున్న పేర్లలో సన్ రైజర్స్ గైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పేరు కూడా ఒక్కటి. ప్రతి బంతిని 150 కీమీ వేగంతో విసిరే అతని స్పీడ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఆ స్పీడ్ అనేది నాకు సహజంగానే వచ్చింది అని ఉమ్రాన్ మాలిక్ అంటున్నాడు.
అతని పై కురుస్తున్న ప్రశంసల పై తాజాగా ఉమ్రాన్ మాట్లాడుతూ… నాకు ఈ స్పీడ్ అనేది నాకు సహజంగా వచ్చింది. అయితే నేను మొదహ్ట్లో బంతిని స్పీడ్ గా వేసేవాడిని కానీ.. లైన్ లెంగ్త్ ఉండేది కాదు. కానీ ఒక్కసారి మా క్యాంప్ కు ఇర్ఫాన్ పఠాన్ సార్ వచ్చారు. ఆయనే మాకు బంతిని సరిగ్గా ఎక్కడ వేయాలి అనేది నేర్పించారు. అప్పటి నుండి నా స్పీడ్ కు లైన్ లెంగ్త్ తోడయ్యాయి అని ఉమ్రాన్ చెప్పాడు.
 అలాగే క్రికెట్ లో ఎంతో సాధించిన దిగ్గజ ఆటగాళ్లు నన్ను పోగుతున్నారు అంటే.. వారు నా లోపల ఏదో టాలెంట్ గుర్తించే ఉంటారు కదా..! అని ఉమ్రాన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటె.. ఉమ్రాన్ ఈ ఐపీఎల్ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో భరత్ తరపున ఆడనునట్లు ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఉమ్రాన్ భారత జట్టులోకి వస్తాడా.. లేదా అనేది.
ఇవి కూడా చదవండి :
Visitors Are Also Reading