Home » ఉమ్రాన్ కు బంపర్ ఆఫర్.. టీం ఇండియాలోకి ఎంట్రీ..?

ఉమ్రాన్ కు బంపర్ ఆఫర్.. టీం ఇండియాలోకి ఎంట్రీ..?

by Azhar

ఐపీఎల్ 2022 లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకపోవడంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్ లలో అంతగా రాణించలేకపాయినా ఇప్పుడు దూసుకపోతున్నాడు. ప్రతి బంతిని 150 కి.మీ కంటే మవేగంగా విసరాగలిగే సత్తా ఉన్న మాలిక్ పేరు రెండు రోజుల నుండి మారుమోగిపోతుంది. అందుకు కారణం గత మ్యాచ్ లో పంజాబ్ పై అతను వేసిన ఆఖరి ఓవరే కారణం.

ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసుకున్న ఉమ్రాన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ స్పెల్ మాజీ క్రికెటర్లతో పాటుగా రాజకీయనాకులను కూడా కట్టిపడేసింది. దాంతో ఉమ్రాన్ ను భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువైంది. అయితే పంజాబ్ పై అతను చేసిన ప్రదర్శన బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడినట్లు తెలుస్తుంది. అందుకే అతనికి బంపర్ ఆఫర్ తగ్గినట్లు సమాచారం.

ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఇండియా పర్యటనకు వస్తుంది. అయితే ఈ పర్యటనలో భాగంగా జరిగే 5 టీ20ల సిరీస్ కు ఉమ్రాన్ ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ సిరీస్ లో గనక ఉమ్రాన్ రాణించగలిగితే అతడిని ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ కప్ కు ఎంపిక చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి :

కావ్యపాప రషీద్ ను వదిలేసి వీరిని ఎందుకు తీసుకుందో తెలుసా..?

ఐపీఎల్ వాయిదా వేయాలంటున్న ఆ జట్ల అభిమానులు…!

Visitors Are Also Reading