Home » ఇప్పటికి నెం 1గా ప్రభాస్..!

ఇప్పటికి నెం 1గా ప్రభాస్..!

by Azhar
Ad
ప్రస్తుతం తెలుగు సినిమాలు అనేవి బాలీవుడ్ ను ఏలుతున్నాయి అనేది తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా గేట్లు తెరవగా.. ఇప్పుడు చాలా మంది హీరోలు అందులోనుండి వెళ్తున్నారు. అయిన కూడా మన తెలుగులో ప్రస్తుతం టాప్ హీరో ఎవరు అనే చర్చ అనేది ఎప్పుడు ఫ్యాన్స్ మధ్యలో జరుగుతుంది. దానికి సమాధానం అనేది తాజాగా ఓర్మాక్స్ మీడియా సంస్థ వెల్లడించింది.
తెలుగులో టాప్ హీరో ఎవరు అనే సర్వే నిర్వహించిన ఆ సంస్థ తాజాగా ఫలితాలు వెల్లడించింది. అయితే అందులో మొదటి స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలు హిట్ కాకపోయినా.. ఆదిపురుష్ టీజర్ పైన నెగెటివ్ టాక్ అనేది వచ్చినా మొదటి స్థానం ప్రభాస్ కే సొంత అయ్యింది.
ఇక రెండో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉండగా.. మూడులో పుష్ప తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత టాప్ 10 వరకు వరుసగా.. రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. అయితే లైగర్ వారి పెద్ద ప్లాప్ అలాగే వరుసగా ఇదే ఏడాది మూడు డిజాస్టర్స్ ఇచ్చిన విజయ్, రవితేజ కూడా ఈ టాప్ 10 లో ఉండటం అనేది గమనార్హం. చూడాలి మరి వచ్చే ఏడాదిలో ఈ లిస్ట్ లో ఏ రకమైన మార్పులు అనేవి వస్తాయి అనేది.

Advertisement

Visitors Are Also Reading