Home » బీసీసీఐ ఎన్నికలు కాకపోతే CAB ఎన్నికలు అంటున్న దాదా..!

బీసీసీఐ ఎన్నికలు కాకపోతే CAB ఎన్నికలు అంటున్న దాదా..!

by Azhar
Ad

సౌరవ్ గంగూలీ.. భారత జట్టుకు కొత్త పద్దతి నేర్పిన కెప్టెన్. అలాగే విదేశాల్లో మన జట్టుకు విజయాలను అలవాటు చేసింది కూడా దాదా అనడంలో ఏ సందేహం లేదు. అయితే కెప్టెన్ గా భారత జట్టును ఎంతో సమర్ధవంగా నడిపిన గంగూలీ.. 2019 లో బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. దాంతో దాదా బీసీసీఐలో చాలా మార్పులు చేస్తాడు అని అందరూ అనుకున్నారు.

Advertisement

కానీ గంగూలీ మాత్రం వారి అంచనాలను అందుకోలేకపోయారు. అందుకే ఈ ఏడాది మల్లి బీసీసీఐ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. కానీ బీసీసీఐ పేదలు అందరూ దాదాకు వ్యతిరేకం కావడంతో.. గంగూలీ మళ్ళీ ఆ పదవిలో కూర్చోలేకపోయాడు. అందువల్ల దాదా ఇప్పుడు ఏం చేస్తారు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. బీసీసీఐ పీఠం కాదు కానీ.. ఐపీఎల్ పీఠం ఇస్తాం అని చెప్పిన గంగూలీ దైని వదులుకున్నాడు.

Advertisement

అందువల్ల గంగూలీ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని అనుకునే వారికి దాదా షాక్ ఇచ్చాడు అనే చెప్పాలి. బీసీసీఐ ఎన్నికలు కాకపోతే CAB ఎన్నికల్లో పాల్గొంటాను అని గంగూలీ ప్రకటించాడు. CAB అంటే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్. బీసీసీఐ ప్రెసిడెంట్ కాకముందే దాదా ఈ క్యాబ్ కు అధ్యక్షునిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ చేరడంతో మళ్ళీ తన పాత స్థానానికి క్యాబ్ ప్రెసిడెంట్ పదవికి వెళ్ళాలి అని గంగూలీ భావించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ మినీ వేలం ఫిక్స్.. ఫ్రాంచైజీల పర్సు కూడా పెంచిన బీసీసీఐ..!

కరోనా పాజిటివ్ తో కూడా మ్యాచ్ ఆడొచ్చు అంటున్న ఐసీసీ..!

Visitors Are Also Reading