Home » ఇండియా ప్రపంచ కప్ గెలవదను గంభీర్.. ప్లీజ్..!

ఇండియా ప్రపంచ కప్ గెలవదను గంభీర్.. ప్లీజ్..!

by Azhar
Ad
భారత మాజీ ఓపెనర్.. అగ్రెసివ్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నా గౌతమ్ గంభీర్ ను భారత అభిన్నులు ఓ కోరిక కోరుతున్నారు. అదేంటంటే.. ఇండియా ప్రపంచ కప్ గెలవదను గంభీర్.. ప్లీజ్ అని అభ్యర్థిస్తున్నారు. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. మాములుగా సినిమాల విషయంలో ఎన్ని సెంటిమెంట్స్ ఉంటాయో క్రికెట్ లో కూడా అదే రకమైన సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి అనేది అందరికి తెలిసిందే.
అయితే క్రికెట్ లో గంభీర్ విషయంలో ఉన్న సెంటిమెంట్ ఏంటి అంటే.. అతను ఏ ఆటగాడు బాగా ఆడుతున్నాడు అని కామెంట్స్ చేస్తే.. ఆ ఆటగాడి తర్వాతి మ్యాచ్ లో డక్ ఔట్ అయ్యి వస్తాడు. ఈ విషయాని ఐపీఎల్ లోను.. అంతర్జాతీయ మ్యాచ్ లలోను చాలాసార్లు చూసారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో అతను లక్నో జట్టు మెంటార్ గా ఉండటం వల్ల వేరే జట్ల ఆటగాళ్ల పైన కామెంట్స్ అనేవి చేయలేదు.
కానీ తాజాగా ఈ రోజు ప్రపంచ కప్ 2022 అనేది ప్రారంభమైంది. ఇందులో శ్రీలంక – నమీబియా మధ్య మెదటి మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ కంటే ముందు గంభీర్ లంక జట్టును పొగిడాడు. అంతే.. ఆసియా కప్ విజేతగా ఉన్న లంక జట్టు అనేది నమీబియా చేతిలో ఓడిపోయింది. అందువల్ల గంభీర్ పవర్ ఇంకా తగ్గలేదు ఐ తెలుసుకుని ఫ్యాన్స్.. మనం ప్రపంచ కప్ గెలవలేము అంటే గెలుస్తాం అని గంభీర్ కోరుకుంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading