Home » వివాదాస్పదంగా నాగబాబు ట్వీట్..!

వివాదాస్పదంగా నాగబాబు ట్వీట్..!

by Sravya
Ad

అల్లు అర్జున్ తన స్నేహితుడుని సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోతోంది. ఏపీ లోక్ సభ ఎన్నికల ప్రచారం టైం లో చాలా మంది సెలబ్రిటీలు తమకి నచ్చిన పార్టీలకు మద్దతుగా నిలుచున్నారు. ఐకాన్ స్టాల్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షమవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది ప్రాణ మిత్రుడు అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లకు అభిమానులకు బన్నీ విజ్ఞప్తి చేశారు. అయితే మెగా ఫ్యామిలీ తరఫున నిలబడాల్సిన అల్లు అర్జున్ ఇలా స్నేహితుడు తరఫున నిలబడటం అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

Advertisement

ఏపీలో ఎన్నికలు ముగిసి పోయేక కూడా ఈ ఇష్యూ ఇంకా సర్దుకోలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు ట్రీట్ ప్రస్తుతం అగ్గి రాజేసింది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే. మాతో నిలబడే పరాయివాడైన మా వాడే అని ఆయన పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు దుమారం రేపుతోంది.

Advertisement

Also read:

Also read:

అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు ఈ పోస్ట్ చేశారని సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వతహాగా నాగబాబు తన సోదరులు అయిన చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోరు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ముందు నిలబడతారు. పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి కోసం అల్లు అర్జున్ వెళ్ళడాన్ని నాగబాబు జీర్ణించుకోలేకపోయారని అందుకని ఇలా బదులిచ్చారని అంతా అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading