Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ స‌భ్యుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ స‌భ్యుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Today Rashi phalau in Telugu 14.04.2022: మేషం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో విజ‌య‌సిద్ధి ఉంది. ఒక శుభ‌వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. తోటివారి స‌హాయ స‌హ‌కారాలున్నాయి. దైవ‌బ‌లం ర‌క్షిస్తోంది.

Today rashi phalau in telugu : వృషభం 

ల‌క్ష్యాల‌కు క‌ట్టుబ‌డి ప‌ని చేస్తారు. ధ‌ర్మ సందేహాల‌తో కాలాన్ని వృథా చేయ‌క్ండి. కుటుంబ స‌భ్యుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. మ‌నోవిచారం క‌ల‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణంలో ఆటంకాలు క‌లుగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

శుభ‌ప్ర‌ద‌మైన కాలాన్ని గ‌డుపుతారు. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ప్రారంభించ‌బోయే ప‌నుల‌కు ఆటంకాలు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. అకార‌ణ క‌ల‌హ సూచ‌న‌. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : సింహం

స‌మాజంలో పేరు ప్ర‌తిష్ట‌ల‌ను సంపాదిస్తారు. ఆత్మీయుల‌తో కలిసి మ‌రువ‌లేని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : క‌న్య

మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే విజ‌యం మీదే. మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : తుల

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. కాలాన్ని స‌ద్వినియోగం చేసుకోండి. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు సిద్ధిస్తాయి. వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌కండి. ఉద్యోగంలో ఉన్న‌త అధికారుల‌తో న‌మ్ర‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. గిట్ట‌ని వారు మీ ఉత్సాహంతో నీళ్లు చ‌ల్లుతారు. మ‌నోవిచారం క‌లిగించే సంఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

స‌కాలంలో ప‌నులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. గొప్పవారిని క‌లుస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది.

Today  rashi phalau in telugu మకరం

ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా ప‌రిష్క‌రిస్తారు. ప్ర‌సంగాల‌తో స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి. మీపై అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం దుష్టుల‌ను ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. తోటివారి స‌హ‌కారం ఉంది. స‌మ‌యానికి ఆహారంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మీనం

 

ఆత్మ‌బ‌లంతో ముందుకు సాగి విజ‌యం సాధిస్తారు. ధ‌న‌ధాన్యాభివృద్ధి క‌ల‌దు. మాట ప‌ట్టింపుల‌కు పోకండి. మొహ‌మాటం వ‌ల్ల లేనిపోని స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకోకండి. ఎవ‌రినీ అతిగా న‌మ్మ‌కండి.

ఇవి కూడా చదవండి :

1.పెళ్లి తర్వాత రిసెప్షన్ చేసుకోవచ్చా..!

2.రెండో పెళ్లి చేసుకున్న గెట‌ప్ శ్రీ‌ను.. ఫోటోలు వైర‌ల్‌..!

3. Viral Video : పెళ్లిలో వ‌ధువు అరాచ‌కం.. వ‌రుడికి పీట‌ల మీదే వేలు చూపిస్తూ.. ఏమి చేసిందంటే..?

 

Visitors Are Also Reading