Home » పెళ్లి తర్వాత రిసెప్షన్ చేసుకోవచ్చా..!

పెళ్లి తర్వాత రిసెప్షన్ చేసుకోవచ్చా..!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

వివాహమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. ప్రస్తుతం ఈ వివాహాన్ని చాలామంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అలాంటి వివాహం గురించి తెలుసుకుందాం..!వివాహం అనేది స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అటువంటి వివాహాలు పూర్వకాలంలో పెద్దలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య సంబంధాలనేవి కుదుర్చుకునే వారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మ్యాట్రిమోనీ సంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు గానీ,పెళ్లి తర్వాత గాని రిసెప్షన్ అనేది ఖచ్చితంగా నిర్వహించాలా..?

Advertisement

వివాహాన్ని మనం కొత్తకొత్త పద్ధతులను చేర్చి దాన్ని కలుషితం చేస్తున్నాం. ఇప్పుడు మనం పెళ్లిళ్లలో చేసే కొత్త కొత్త పద్ధతులు శాస్త్ర సంబంధమైనవి కావు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ఎటువంటి అనుబంధం లేకుండా వారిని పక్కపక్కన కూర్చో పెట్టకూడదు. వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది ఉంటేనే పక్కన కూర్చునే అర్హత పొందుతారు. అయితే ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయిందని అంటుంటారు. కానీ అది ఈయన మా అల్లుడు ఈమె మా కోడలు అని నిశ్చయం చేసుకోవడం మాత్రమే అందుకే దాన్ని నిశ్చితార్థ తాంబూలాలు అంటారు.

Advertisement

ఈ నిశ్చితార్థం కొరకు మనం అంగరంగ వైభవంగా స్టేజి వేసి మరి ఏర్పాటు చేసుకుంటాం. ఆ వేదికపై అబ్బాయిని మరియు అమ్మాయిని చక్కగా అలంకరించి కూర్చోబెడతారు. మరి ఈ సమయంలో పలువురు పెద్దలు ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. అప్పుడు వీరు చెప్పులు కానీ షూస్ వేసుకునే స్టేజి పై ఆశీర్వచనాలు పొందుతారు. ఈ విధంగా రిసెప్షన్ పేరుతో సాంప్రదాయాలను మట్టిలో కలుపుతున్నారని పలువురు పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :
Health tips Telugu: అధిక డీహైడ్రేషనా.. అయితే ఇవి తినాల్సిందే..!!

రైల్లో కిటికీలకు ఇనుప కడ్డీలు అడ్డంగా ఎందుకు బిగిస్తారో మీకు తెలుసా..!! 

అర‌టి ఆకులు శ‌తాబ్దాలుగా భార‌తీయ ఆహారంలో ఎందుకు భాగమ‌య్యాయో తెలుసా..?

Visitors Are Also Reading