Home » మూడో టీ20 లో మూడు మార్పులతో టీం ఇండియా…!

మూడో టీ20 లో మూడు మార్పులతో టీం ఇండియా…!

by Azhar
Ad

సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చిన కారణంగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు ఐపీఎల్ లో రాణించిన యువ ఆటగాళ్లను ఎంపిక చేసారు భారత సెలక్టర్లు. ఆ జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించారు. కానీ అనూహ్యంగా రాహుల్ సిరీస్ కు ఒక్కరోజు ముందు గాయంతో తప్పుకోవడంతో న్యాయకత్వ బాధ్యతలు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి వచ్చాయి. కానీ పన్తం కెప్టెన్సీని అంత గబా చేయలేకపోతున్నాడు. ఆడిన మొదటి రెండు మ్యాచ్ లలో కూడా టీం ఇండియా ఓడిపోయింది. దాంతో నేడు జరగనున్న మూడో మ్యాచ్ లో మూడు మార్పులతో బరిలోకి వస్తుంది టీం ఇండియా.

Advertisement

 

మొదట రెండు మ్యాచ్ లలో కేవలం ఒక్కే వికెట్ తీసిన చాహల్ ను తుది జట్టు నుండి తప్పించినట్లు తెలుస్తుంది. చాహల్ స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. చాహల్ ఐపీఎల్ లో బాగా రాణించిన ఈ సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇక మరి స్పిన్ ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ ను కూడా ఈరోజు మ్యాచ్ లో నుండి తీసేసినట్లు తెలుస్తుంది. ఆల్ రౌండర్ అయిన కాశారు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింట్లోనూ విఫలమవుతున్నాడు.

Advertisement

గత మ్యాచ్ లో అతడిని దినేష్ కార్తీక్ కంటే ముందు బ్యాటింగ్ కు పంపించడం చాలా తప్పు అయిందని విమర్శలు కూడా వచ్చాయి. అందుకే అతని స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకోనున్నారు. అలాగే మరో బౌలర్ అవేశ్ ఖాన్ ను కూడా ప్లేయింగ్ ఎలెవన్ నుండి పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అవేశ్ ఖాన్ ను బదులుగా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. రెండో టీ20 లో అవేశ్ ఖాన్ బాగానే బౌలింగ్ చేసాడు. కానీ ఉమ్రాన్ కు అవకాశం ఇవ్వడం కోసం రెండు టీ20 లో అదరగొట్టిన భువనేశ్వర్ కుమార్ ను కొనసాగిస్తూ అవేశ్ ఖాన్ ను జట్టు నుండి తీసేయనునట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

సచిన్ తర్వాత ఉమ్రాన్ కోసమే..?

వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

Visitors Are Also Reading