Home » సచిన్ తర్వాత ఉమ్రాన్ కోసమే..?

సచిన్ తర్వాత ఉమ్రాన్ కోసమే..?

by Azhar
Ad

ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడు భారత క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారాడు. ఐపీఎల్ 2021 లో చివర్లో ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ తన పేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో ఈ ఏడాది మళ్ళీ సన్ రైజర్స్ జట్టే అతని రిటైన్ చేసుకుంది. ఇక ఆంచలనకు మించి ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడిన ఉమ్రాన్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిసాయి. అతను ఓ అద్భుతం అని చాలా మంది మాజీలు పొగిడారు. అలాగే అతడిని వెంటనే టీం ఇండియాలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేసారు.

Advertisement

దాంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్న మొదటి టీ20 సిరీస్ లోనే ఉమ్రాన్ ను టీం ఇండియా కు ఎంపిక చేసారు. కానీ ఇప్పటికి జరిగిన రెండు మ్యాచ్ లలోను తుది జట్టులో అవకాశం అనేది కల్పించలేదు. ధనతో ఉమ్రాన్ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదు.. నేను సచిన్ తర్వాత ఉమ్రాన్ ఆట కోసం ఎంతో ఎదురు చేసుతునను అని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. తాజాగా సన్నీ మాట్లాడుతూ… ఉమ్రాన్ మాలిక్ ను వెంటనే భారత తుది జట్టులోకి తీసుకోవాలి. ఇంకా అతడిని బెంచ్ మీద కూర్చోబెట్టకూడదు.

Advertisement

నేను గతంలో సచిన్ ఆట చూడటానికి ఎంతగానో ఎదుచూసేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉమ్రాన్ ఆట చూడటానికే అంతలా ఎదురు చూస్తున్నాను. నన్ను అతను అంతలా ఆకర్షించాడు. కాబట్టి నేడు జరగనున్న మూడో టీ20 లో ఉమ్రాన్ కు తుది జట్టులో చోటివ్వాలి. అలా చేయడం వల్ల అతనికి కూడా ఆత్మవిశ్వసం అనేది పెరుగుతుంది అని గవాస్కర్ తెలిపాడు. అలాగే గత రెండు టీ20 మ్యాచ్ లలో కూడా భారత బౌలింగ్ బాగా తేలిపోయింది. భువనేశ్వర్ కుమార్ ఒక్కడు మిన్నగా మిగిలిన వారెవరు రాణించడం లేదు. అందుకే ఉమ్రాన్ జట్టులోకి వాతే భారత బౌలింగ్ పెరుగుతుంది అని సన్నీ సూచించారు.

ఇవి కూడా చదవండి :

ధోని ఏం ఆలోచిస్తున్నాడు అనేది అతను మైండ్ చదివి తెలుసుకుంటా..!

వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

Visitors Are Also Reading