Home » మిమ్మల్ని గ్యాస్ సమస్య వేధిస్తుందా..? ఈ చిట్కాతో వదిలించుకోండి..!

మిమ్మల్ని గ్యాస్ సమస్య వేధిస్తుందా..? ఈ చిట్కాతో వదిలించుకోండి..!

by Anji
Ad

సాధారణంగా ఈ మధ్యకాలంలో అసలు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ ఏదో ఒక ఒక సమస్య వేధిస్తూనే ఉంది.  అందులో ప్రధానంగా గ్యాస్ సమస్య ఒకటి. కాస్త ఎక్కువగా తిన్నారంటే చాలు గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్ సమస్య రావడానికి రకరకాల కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అధిక బరువు పెరగడం, ఆహారాన్ని తినేటప్పుడు సరిగ్గా నమలకపోవడం వంటి కారణాలు ఎన్నో ఉంటాయి.  గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చిట్కాను పాటించి మీ గ్యాస్ సమస్యను దూరం చేసుకోండి. 

Advertisement

ముఖ్యంగా గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి  పలు విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు. గ్యాస్ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని మాత్రలు వాడినప్పటికీ గ్యాస్ సమస్య తగ్గి కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. గ్యాస్ సమస్య తగ్గిపోవడానికి మన వంటింట్లోనే కొన్ని చిట్కాలున్నాయి.  గ్యాస్ సమస్య ఉన్నప్పుడు వాంతులు, కడుపునొప్పి,  చికాకు పొట్టలో గ్యాస్ ఉండడం వల్ల ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.  వీటికి చెక్ పెట్టేందుకు వంటింటి చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Also Read :  చలపతిరావు జీవితంపై ఓ సినిమా కూడా వచ్చిందని మీకు తెలుసా..?

manam News

ముందుగా కాస్త వేడి నీటిని తీసుకొని ఒక గ్లాస్ జీలకర్ర చిన్న దాల్చిన ముక్క వేసి 5 నిమిషాల పాటు కాస్త మరగనిచ్చి ఆ నీటిని వడగట్టి అందులోకి కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది. ఇలా  కనీసం రోజుకు రెండు సార్లు తాగితే చాలు గ్యాస్ సమస్య ఉండదు. అయితే ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ముఖ్యమైన నూనెల లాలజల గ్రంథులు ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేస్తాయి. దాల్చిన చెక్కలు నూనెల శక్తివంతమైన మైక్రోబియన్లు లక్షణాలను కలిగి ఉంటాయి. జీర్ణశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా సులభంగానే ఎడిసిసీ గ్యాస్ సమస్యలను నివారించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి.

Also Read :  మీ జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు ఈ చిట్కా తప్పక పాటించండి..!

Visitors Are Also Reading