Home » ఆస్కార్ నామినేషన్ 2023 పూర్తి జాబితా ఇదే..!

ఆస్కార్ నామినేషన్ 2023 పూర్తి జాబితా ఇదే..!

by Anji
Published: Last Updated on
Ad

ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఆస్కార్ నామినేషన్స్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి. ఇందుకు ప్రధాన కారణం ఆర్ఆర్ఆర్ చిత్రం బరిలో ఉండడమే అని చెప్పాలి. విదేశీయుల్లో సైతం ఈ సినిమాపై వచ్చిన క్రేజ్ చూసి ఆస్కార్స్ కి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన తరువాత ఆస్కార్స్ కి ఆర్ఆర్ఆర్ తప్పకుండా నామినేట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 

Advertisement

పలు భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాను ఎంపిక చేసారు. ఉత్తమ సినిమా విభాగంలో ఈ చిత్రం నామినేట్ అవుతుందనే ఆశలు మాత్రం నీరు గారిపోయాయి. కేవలం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ తప్ప.. ఏ ఇతర విభాగాలలో ఆర్ఆర్ఆర్ చిత్రం చోటు దక్కించుకోలేదు. ప్రధానంగా ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ నామినేట్ అవ్వవచ్చని అభిమానులు ఎంతో ఆశించారు. కొద్ది రోజుల నుంచి #NTRForOscars అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా ట్రెండ్ చేసారు. అయినప్పటికీ అభిమానుల ఆశలు నెరవేరలేదు. లగాన్ తరువాత ఆస్కార్ కి నామినేట్ అయిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మాత్రం రికార్డు సృష్టించింది. 11 విభాగాలలో నామినేషన్స్ దక్కించుకున్నది. డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో రెండు భారతీయ డాక్యుమెంటరీలకు చోటు దక్కింది. ది ఎలిఫెంట్ విష్పర్స్, ఆల్ దట్ బ్రీత్స్. 

Also Read :  ఆర్ఆర్ఆర్ లో ‘నాటు నాటు’ పాట షూటింగ్ చేసిన ఈ ప్యాలెస్ గురించి మీకు తెలుసా ?

ఆస్కార్ నామినేషన్స్ 2023 జాబితా :

ఉత్తమ చిత్రం 

  • అవతార్ : ది వే ఆఫ్ వాటర్
  • టాప్ గన్ : మావెరిక్
  • ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • ది బన్సీస్ ఆఫ్ ఇనిషెరిన్
  • ఎల్విస్
  • ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ది ఫేబుల్ మ్యాన్స్
  • టార్
  • ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్
  • ఉమెన్ టాకింగ్

ఉత్తమ దర్శకుడు 

Manam News

  • మార్టిన్ మెక్ డొనాగ్ ( ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ )
  • స్టీవెన్ స్పీల్ బర్గ్ (దిఫేబుల్ మ్యాన్స్)
  • డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ )
  • టడ్ ఫీల్డ్ (టార్ )
  • రూబెన్ ఆస్టాండ్ (ట్రై యాంగిల్ ఆఫ్ సాడ్ నెస్ )

Also Read :  కస్తూరి స్విమ్మింగ్ వీడియో పై నెటిజన్ అలాంటి కామెంట్…దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన నటి ..!

ఉత్తమ నటుడు

Manam News

  • ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
  • కొలిన్ ఫార్రెల్ ( ది బాన్షిస్ ఆఫ్ ఇనిషైరైన్)
  • బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్)
  • పాల్ మెస్కల్ (ఆప్టర్ సన్ )
  • బిల్ నిగీ (లివింగ్)

Also Read :  రాజమౌళిని చంపేందుకు కుట్ర…వైరల్ అవుతున్న టాప్ డైరెక్టర్ ట్వీట్…!

Advertisement

ఉత్తమ నటి 

  • కేట్ బ్లాంషెట్ (టార్)
  • అన్నా దె అర్మాస్ (బ్లాండ్)
  • ఆండ్రియా రైజ్ బరో ( టు లెస్లీ)
  • మిషెల్ విలియమ్స్ ( ది ఫేబుల్ మ్యాన్స్)
  • మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ )

ఒరిజినల్ సాంగ్ 

  • నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
  • అప్లాజ్ ( టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ )
  • హోల్డ్ మై హ్యాండ్ ( టాప్ గన్ మార్వెరిక్ )
  • లిప్ట్ మీ అప్ ( బ్లాక్ పాంథర్ )
  • ది ఈజ్ ఏ లైఫ్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ )

ఉత్తమ సహాయ నటుడు 

  • బ్రెన్డాన్ గ్లెసన్ ( ది బన్సిష్ ఆఫ్ ఇనిషెరిన్ )
  • బ్రైయిన్ టైరీ హెన్రీ ( కాజ్ వే)
  • జడ్ హిర్చ్ ( ది ఫేబుల్ మ్యాన్స్)
  • బేరీ కియోఘాన్ ( ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరెన్)
  • కి హుయ్ క్వాన్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ సహాయ నటి

  • ఆంజెలా బాస్సెట్ (బ్లాక్ పాంథర్ వకండ ఫరెవర్ )
  • కార్రె కాండన్ ( ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
  • హాంగ్ చ్యూ ( ది వేల్)
  • జామీ లీ కర్టిస్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • స్టెఫానీ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ )

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్

  • బేబీలాన్ ( మ్యారీ జోఫెర్స్ )
  • బ్లాక్ పాంథర్ వకండా ఫరెవర్ (రూథ్ కార్టర్)
  • ఎల్విస్ ( కేథరిన్ మార్టిన్)
  • ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్( షెర్లీ కురాట)
  • మిసెస్ హారిస్ గోస్ టూ పారిస్ ( జెన్నీ బియావాన్ )

Also Read :   2.5 రేటింగ్ తో 2.5 మిలియన్ కలెక్షన్స్ కొట్టి చూపించానంటున్న చిరంజీవి

బెస్ట్ సౌండ్ 

  • ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • అవతార్ : ది వే ఆఫ్ వాటర్
  • ది బ్యాట్ మెన్
  • ఎల్విస్
  • టాప్ గన్ : మావరిక్

స్క్రీన్ ప్లే 

  • మార్టిన్ మెక్ డొనాగ్ ( ది బన్షిస్ ఆఫ్ ఇనిషెరిన్ )
  • డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • స్టీవెన్ స్పీల్ బర్గ్, టోనీ కుష్నెర్ ( ది ఫేబుల్ మ్యాన్స్)
  • టడ్ ఫీల్డ్ (థార్)
  • రూబెన్ ఆస్ట్లాండ్ ( ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ

  • ఆల్ క్వైట్ అన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ( జేమ్స్ ఫ్రెండ్)
  • బార్డ్, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్ పుల్ ఆఫ్ ట్రూత్స్ ( డారియస్ కోహోన్  డ్జీ)
  • ఎల్విస్ ( మ్యాండీ వాకర్)
  • ఎంఫైర్ ఆఫ్ లైట్ ( రోగల్ డీకిన్స్ )
  • టార్ ( ఫ్లోరెన్ హోఫ్ మెస్టర్ )

ఉత్తమ ఎడిటర్ 

  • మ్యాట్ విల్లా, జోనాథన్ రెడ్మండ్ (ఎల్విస్)
  • పాల రోజర్స్ ( ఎవ్రీథింగ్, ఎవ్రీరవెర్ ఆల్ ఎట్ వన్స్ )
  • మోనికా విల్లీ (టార్)
  • ఎడీ హామిల్టన్ ( టాప్ గన్ మావరిక్)
  • మికెల్ ఇ.జి. నీల్సెన్ ( ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ 

  • ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ( జర్మనీ)
  • అర్జెంటీనా, 1985 ( అర్జెంటీనా)
  • ఇయో ( పోలండ్)
  • క్లోజ్ (బెల్జియం )
  • ది క్వైట్ గాళ్ ( ఐర్లాండ్ )

Also Read :  కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడు అనే విషయం మీకు తెలుసా..?

Visitors Are Also Reading