Home » రాజమౌళిని చంపేందుకు కుట్ర…వైరల్ అవుతున్న టాప్ డైరెక్టర్ ట్వీట్…!

రాజమౌళిని చంపేందుకు కుట్ర…వైరల్ అవుతున్న టాప్ డైరెక్టర్ ట్వీట్…!

by AJAY
Ad

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ కు సైతం నామినేట్ అయ్యింది. అంతేకాకుండా సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ఇండియా వ్యాప్తంగా వ్యాపించగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయికి వెళ్ళింది. నెట్ ఫిక్స్ లో ఈ సినిమాను విదేశీయులు చూస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

అంతేకాకుండా సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన పై సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా పై…. రాజమౌళి పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల రాజమౌళిని హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ప్రశంసించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమా చూసి జేమ్స్ కెమెరాన్ జక్కన్న తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ వీడియోను ఆర్జీవి షేర్ చేస్తూ… మొగల్ ఆజాం తీసిన క ఆసిఫ్ నుండి షోలే వరకు షోలే సినిమా తీసిన రమేష్ సిపి వరకు అందరినీ నువ్వు అధిగమించావు. ఆదిత్య చోప్రా కరణ్ జోహార్ లాంటి వారిని దాటేశావు. నీ కాలి బొటనవేలు ను చీ*లని ఉంది.

రాజమౌళి సార్ మీరు దయచేసి భద్రతను పెంచుకోండి. ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అందరూ మీ మీద ద్వేషంతో రగిలిపోతున్నారు. వాళ్లంతా కలిసి మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు… వారిలో నేను కూడా ఉన్నాను. కానీ నాకు నాలుగు రౌండ్లు పడేసరికి నిజం చెప్పేశాను. అంటూ ఆర్జీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ALSO READ :కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడు అనే విషయం మీకు తెలుసా..?

Visitors Are Also Reading