Home » 2.5 రేటింగ్ తో 2.5 మిలియన్ కలెక్షన్స్ కొట్టి చూపించానంటున్న చిరంజీవి

2.5 రేటింగ్ తో 2.5 మిలియన్ కలెక్షన్స్ కొట్టి చూపించానంటున్న చిరంజీవి

by Anji
Published: Last Updated on
Ad

Waltair Verayya Collections: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో పుల్ జోష్ లో ఉన్నారు.  చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. చిరంజీవి విధ్వంసానికి రికార్డులన్నీ షేక్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా కంటే ముందుగానే ఒకరోజు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రము విడుదలైంది.

Advertisement

 

కలెక్షన్లలో ఎంత తేడా ఉందో తెలిసిన విషయమే. అన్ని కోట్ల తేడా ఉందంటే వాల్తేరు వీర సినిమా జనాలు ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీసులలో కూడా వాల్తేరు వీరయ్య కు జనాలు నీరాజనాలు పడుతున్నారు.కేవలం రెండు వారాల్లోనే రెండున్నర మిలియన్ల డాలర్లకు చేరుకుంది వాల్తేరు వారయ్య చిత్రం. మరోవైపు ఈ చిత్రానికి రేటింగ్ కూడా 2.5, 2.25  ఇచ్చారు. దీనికి చిరంజీవి 2.25 ఇచ్చింది రేటింగ్ సినిమాకి 2.5 మిలియన్ డాలర్లకు అని చెప్పుకొచ్చారు.  అక్కడ ఇంత రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు చిరంజీవి జూమ్ కాల్ లో మాట్లాడాడు.

Also Read : ముదురుతున్న అక్కినేని వర్సెస్ బాలయ్య వివాదం… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్ అసోసియేషన్….!

చిరంజీవి తన యూఎస్ అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వాల్తేరు వీరయ్య స్టైల్ లో డైలాగ్స్ చెప్పేశాడు. ప్రేమతో నాకు కడుపు నిండిపోతుందన్నాడు. చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు మన నుంచి ఎలాంటి చిత్రాలు ప్రేక్షకులకు కావాలో అర్థమైందని.. ఇకపై తాను సైరా నరసింహారెడ్డి సినిమాలు చేయనని తన నుంచి మాస్ మసాలా కమర్షియల్ చిత్రాలే వస్తాయి అని చిరంజీవి తన అభిమానులకు చెప్పాడు. దీంతో మెగాస్టార్ అభిమానులు సంబుర పడుతున్నారు.

Also Read :   ప్రాణ స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading