Home » ఆర్ఆర్ఆర్ లో ‘నాటు నాటు’ పాట షూటింగ్ చేసిన ఈ ప్యాలెస్ గురించి మీకు తెలుసా ?

ఆర్ఆర్ఆర్ లో ‘నాటు నాటు’ పాట షూటింగ్ చేసిన ఈ ప్యాలెస్ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్  విడుదల అయిన తర్వాత ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా జక్కన్న ప్రతిభను చూసి మరోసారి మెచ్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో మళ్లీ ఆ పాటలకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉన్నదని మళ్లీ సంతోషిస్తున్నాం. అటు నాటు నాటు సాంగ్  ఇంత పెద్ద హిట్ అయిన తరువాత ఎవ్వరూ ఆలోచించని ఓ విషయం ఏంటంటే.. ఈ పాట చిత్రీకరణ కోసం జరిగిన ప్రదేశం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఈ పాట ఎక్కడ షూటింగ్ జరుపుకుంది.. ఎలా జరిగింది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Advertisement

తొలుత నాటు నాటు పాట ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ  2020లో అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణము ఉండేది. ఈ పాటను షూట్ చేసింది ఉక్రెయిన్ లోని ఒక ప్యాలెస్ లో. అది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు అయినటువంటి జెలెన్ స్కీ భవనం. ఉక్రెయిన్ యుద్ధంలో అతడు హీరోగా నిలిచాడు. ఈ ప్యాలెస్ లో షూటింగ్ కోసం జెలెన్ స్కీ కూడా ఒప్పుకున్నాడు. అందుకు  ఓ కారణం ఉందండోయ్..  అతడు ఉక్రెయిన్ కి అధ్యక్షుడు కాకముందు ఓ బుల్లితెర ఆర్టిస్ట్. దీంతో ఓ నటుడు కాబట్టి అతనికి సినిమా వారి సమస్యలు తెలుసు కాబట్టి..  ఒక  సినిమా కోసం తన ఫ్యాలెస్ ని షూటింగ్ కోసం ఇచ్చేశాడు జెలెన్ స్కీ.  

Advertisement

Also Read :   2.5 రేటింగ్ తో 2.5 మిలియన్ కలెక్షన్స్ కొట్టి చూపించానంటున్న చిరంజీవి

ఆర్ఆర్ ఆర్ సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఈ ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకున్నాయి. తొలుత 2018లో ఒకసారి, 2021 లో రెండు సార్లు షూటింగ్ జరుపుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రం.  ప్రస్తుతం మాత్రం ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం ఉండడంతో ఎవరిని కూడా ఆ ప్యాలెస్ లోపలికి ప్రవేశించనివ్వలేదు. ఉక్రెయిన్ లో ఉన్న అత్యంత ముఖ్యమైన చరిత్రాత్మక ప్రదేశం ఇది.  ఈ భవనానికి  చాలా ఏళ్ల చరిత్రనే ఉన్నది. రాజమౌళి ఈ ఫ్యాలసీని  మాత్రమే ఎంచుకోవడానికి గల కారణం బ్రిటిష్ కాలానికి ఈ ప్యాలెస్ ఆర్కిటెక్షర్ చాలా దగ్గరగా ఉంటుంది. బయటి దేశాల్లో ఇంతకన్నా మంచి భవనాలు ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్యాలెస్ అయితేనే చాలా బాగుంటుందని భావించాడు రాజమౌళి. సెట్  కూడా వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని మరి షూటింగ్  పూర్తి చేశారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ తాజాగా ఆస్కార్ అకాడమీ అవార్డులకు సంబంధించి జరిగినటువంటి నామినేషన్స్ లో ఈ పాట నామినేషన్స్ లోకి వెళ్లింది. నాటు నాటు సాంగ్ కచ్చితంగా ఆస్కార్ అవార్డు సాధించే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read :   రాజమౌళిని చంపేందుకు కుట్ర…వైరల్ అవుతున్న టాప్ డైరెక్టర్ ట్వీట్…!

Visitors Are Also Reading