నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య శోభితతో పరిచయం ఎలా ఏర్పడింది అనేది చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని విషయాలని కూడా బయటపెట్టారు. శోభిత కూడా నాగచైతన్య తో ప్రేమలో పడడం గురించి కొన్ని విషయాలని చెప్పారు.
Advertisement
శోభిత నాగచైతన్యతో ప్రేమలో ఎలా పడ్డారు అనే విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఒక ఓటీటీ షోలో పరిచయం ఏర్పడిందని.. ఆయనతో పరిచయం ఏర్పడ్డాక నాగచైతన్య వ్యక్తిత్వం తనకు బాగా నచ్చింది అని చెప్పారు. ఎంతో కూల్ గా కామ్ గా ఆయన ఉంటారని.. ఏ విషయానికి ఆవేశపడరని ఆమె చెప్పారు.
Advertisement
Also read:
సింపుల్ గా ఉంటారని అందుకే ఆయనతో ప్రేమలో పడిపోయానని శోభిత చెప్పారు. చైతన్యలో ఉన్న ఈ లక్షణాలు తనతో ప్రేమలో పడడానికి కారణం అయ్యాయని శోభిత చైతన్య గురించి తనతో ప్రేమలో గురించి చెప్పిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 4న వీళ్ళు ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ మధ్య హల్దీ వేడుకుని కూడా జరిపించారు.