Home » కస్తూరి స్విమ్మింగ్ వీడియో పై నెటిజన్ అలాంటి కామెంట్…దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన నటి ..!

కస్తూరి స్విమ్మింగ్ వీడియో పై నెటిజన్ అలాంటి కామెంట్…దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన నటి ..!

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో కస్తూరి కూడా ఒకరు. కస్తూరి తెలుగు తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటించింది ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. కస్తూరి అన్నమయ్య సినిమాలో నాగార్జున కు జోడీగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆ తరవాత వరుస ఆఫర్ లను అందుకుంది. తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంతే కాకుండా కస్తూరి తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.

Advertisement

ఇక కస్తూరి అంటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అనే పేరు ఉంది. దానికి కారణం మ్యాటర్ ఏదైనా కస్తూరి కౌంటర్ ఇవ్వడం లో ముందు ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కస్తూరి తరచూ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ లకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ నటి గ్లామర్ షో కూడా చేస్తుంది.

Advertisement

kasthuri

కాగా కస్తూరి తాజాగా తన సోషల్ మీడియా లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియో ను షేర్ చేసింది. వీడియో లో కస్తూరి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని కనిపిస్తోంది. అయితే ఈ వీడియో పై ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేసింది. కామెంట్ లో…… మీ మీద మంచి ఒపీనియన్ ఉంది. కానీ మీరు ఇలాంటి వీడియోలు పెట్టి ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు.

పాజిటివ్ గా థింక్ చేయండి మీ శ్రేయభిలాషి. అంటూ పేర్కొంది. ఇక నెటిజన్ కామెంట్ పై కస్తూరి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. కస్తూరి తన రిప్లై లో……మీ ఆలోచన లకు ధన్యవాదాలు. స్విమ్మింగ్ అనేది గ్రేట్ వ్యాయామం. మీరు కూడా ట్రై చేయండి. అంటూ పేర్కొంది. దాంతో కస్తూరి ఇచ్చిన రిప్లై చూసి కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

Visitors Are Also Reading