Home » కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడు అనే విషయం మీకు తెలుసా..?

కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడు అనే విషయం మీకు తెలుసా..?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించినటువంటి నటులలో అలనాటి నటులు ఏవీఎస్ ఒకరు. సినిమాలలో తనదైన డైలాగ్ లతో మేనరిజమ్స్ తో పాత్రను ఎంతో బాగా పండించే వారు. ఇక ఏవీఎస్ యొక్క అసలు పేరు ఆమంచి వెంకట సుబ్బయ్య. ఆయన  అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఏవీఎస్ సినిమాలలోకి రాకముందు తెనాలిలో పౌరోహిత్యం చేశారు. ఇక ఆ తరువాత కొద్ది రోజులకు విజయవాడలో ఓ విలేకరీగా కూడా పని చేశారు ఏవీఎస్. 

Advertisement

ఇక ఆ సమయంలో ఏవీఎస్ ఆర్థికంగా ఎన్నో కష్టాలను అనుభవించారట. తినడానికి కనీసం తిండి కూడా లేకుండా తన ఆకలిని అదుపు చేసుకునేందుకు కిల్లి నమిలేవారట. అంతటి కష్టాలను అనుభవించిన ఏవీఎస్ డబ్బుల కోసం పలు మిమిక్రీ షోలను చేసేవారట. అలా మిమిక్రీ షోలు చేస్తున్న సమయంలోనే ఓ ప్రదర్శనలో టాలీవుడ్ దర్శకుడు బాపు ఏవీఎస్ గారి టాలెంట్ చూసి మిస్టర్ పెళ్లాం సినిమాలో అతనికి అవకాశం ఇచ్చారట. ఆ చిత్రం ఏవీఎస్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత ఆయన ఎన్నో సినిమాలలో సహాయక పాత్రలు పోషించారు. తన కెరీర్ లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. 

Also Read :  వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ ఏమన్నారో తెలుసా ?

Advertisement

ప్రధానంగా కామెడీ పాత్రల్లోనే ఎక్కువగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఘటోత్కచుడు, యమలీల, మాయలోడు, ఇంద్ర, ఆవిడ మా ఆవిడే, సిసింద్రీ, జయం మనదేరా, మావిడాకులు, వెంకీ, బెండు అప్పారావు, సంక్రాంతి శ్రీరామదాస్, రాధాగోపాలం, దేనికైనా రెడి వంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఏవీఎస్. నటుడిగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఆ తరువాత టీడీపీలో సైతం పని చేసారు. ఏవీఎస్  ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆయనకు ఇద్దరు సంతానం. కుమారుడు ప్రదీప్, కూతురు ప్రశాంతి. 2008లో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు ఏవీఎస్. ఇక ఆ సమయంలో ఏవీఎస్ కుమార్తె ప్రశాంతి తండ్రికి కాలేయాన్ని దానం చేసారు. 

Also Read :   దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే జనవరి 26న.. అక్కడ మాత్రం జనవరి 29న ఎందుకో తెలుసా ?

Manam News

అయినప్పటికీ అతను 2013లో మళ్లీ కాలేయ వ్యాధి బారిన పడి.. ఆరోగ్యం క్షీణించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లారు ఏవీఎస్. అతని అల్లుడు కూడా సినీ నటుడే అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతని పేరు శ్రీనివాస్ దావగుడి. సినీ ఇండస్ట్రీలో అతన్ని చింటూ అని పిలుస్తుంటారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించాడు. ఎక్కువగా రవిబాబు తీసే సినిమాలలో కనిపిస్తుంటాడు. చాలా వరకు గుండుతోనే కనిపిస్తాడు. ఇప్పుడిప్పుడు అగ్ర హీరోల సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్నాడు. శ్రీనివాస్ ఒకప్పటి సీనియర్ నటుడు అయినటువంటి ఏవీఎస్ గారి అల్లుడు అనే విషయం మాత్రం ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. 

Also Read :  హీరో సుహాస్ భార్య ఎవరో తెలుసా… వాళ్ళ లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు..!

Visitors Are Also Reading