Home » శరీరంలో కొవ్వును కరిగించే సూపర్‌ ఫుడ్..రోజుకు గ్లాస్ తాగితే చాలు..!

శరీరంలో కొవ్వును కరిగించే సూపర్‌ ఫుడ్..రోజుకు గ్లాస్ తాగితే చాలు..!

by Anji
Published: Last Updated on
Ad

ఆరోగ్యంపై అవగాహన ఉన్న వారు క్రమం తప్పకుండా చియా విత్తనాలు తీసుకుంటారు. ఉదయం నిద్రలేవగానే లేదంటే రాత్రంతా ఖాళీ కడుపుతో ఉన్నవారు చియా సీడ్ వాటర్‌ను తాగితే బరువు సులువుగా తగ్గుతారు. ఈ గింజలు త్వరగా కొవ్వును కరిగిస్తాయి. అయితే ఇవి బరువు తగ్గించడంలో మాత్రమే కాదు ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తాయి. చియా విత్తనాల వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

చియా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, వీటిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో తేమను నిర్వహిస్తుంది. ఈ గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ గింజలను తింటే ప్రయోజనం పొందవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల అజీర్ణం కూడా తగ్గుతుంది.

Advertisement

 

అంతే కాకుండా చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ విత్తనాలను ఎలాంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక విత్తనాలు శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తాన్ని నియంత్రించడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చియా విత్తనాలు శరీరానికి, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతల సమస్యలను నివారిస్తాయి.

Visitors Are Also Reading