Home » నువ్వులని అస్సలు తీసిపారేయకండి.. వీటితో చాలా లాభాలని పొందవచ్చు..!

నువ్వులని అస్సలు తీసిపారేయకండి.. వీటితో చాలా లాభాలని పొందవచ్చు..!

by Sravya
Ad

ఆరోగ్యానికి నువ్వులు చాలా మేలు చేస్తాయో. చాలామంది నువ్వుని తేలికగా తీసుకుంటుంటారు. కానీ నువ్వుల వలన ఎన్నో లాభాలు ఉంటాయి నువ్వులు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. నువ్వులని తీసుకోవడం వలన క్యాల్షియం, ఐరన్, కాపర్, సెలీనియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలని పొందవచ్చు. నువ్వులని తీసుకుంటే మూడు గ్రాముల పీచు కూడా అందుతుంది పీచు వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వుల పొడిని మీరు కూరల్లో వేసుకోవచ్చు. నువ్వులతో లడ్డూలు కూడా చేసుకోవచ్చు. నల్ల నువ్వుల్లో తెల్ల నువ్వుల కంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి నువ్వుల పప్పు కానీ తెలగపిండిని కానీ తీసుకోవచ్చు.

Advertisement

Advertisement

వీటిలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి బాలింతలకి కూడా ఎంతో మంచిది. మెనోపాజ్ లక్షణాలని కంట్రోల్ చేయడానికి నువ్వుల లోని ఫైటో ఈస్ట్రోజన్లు హెల్ప్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. నువ్వుల వలన జుట్టు కూడా బలంగా ఉంటుంది. పిల్లలకి కూడా నువ్వులని పెట్టొచ్చు నువ్వులలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నువ్వులని రోజు తీసుకోవడం వలన ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి త్వరగా బయటపడొచ్చు. నువ్వులను తింటే జీర్ణ సమస్యలు ఏమి రావు. మలబద్ధకం నుండి కూడా బయటకి వచ్చేయొచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు రోజు నువ్వులు తీసుకోవడం మంచిది.

Also read:

Visitors Are Also Reading