Home » Big Boss Season 7: బిగ్ బాస్ షో ని రిజెక్ట్ చేసిన సెలెబ్రిటీ లిస్ట్ ఇదే.. ఎందుకు రిజెక్ట్ చేశారంటే?

Big Boss Season 7: బిగ్ బాస్ షో ని రిజెక్ట్ చేసిన సెలెబ్రిటీ లిస్ట్ ఇదే.. ఎందుకు రిజెక్ట్ చేశారంటే?

by Srilakshmi Bharathi
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది.కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. అయితే కొందరు సెలెబ్రిటీలు బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేయడానికి నిరాకరించారు. వారు ఎవరో, రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నటుడు మహేష్ ఆచంట జబర్దస్త్ తో పాపులర్ అయ్యారు. ఆయనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా తిరస్కరించారట. మొగలిరేకులు ఫేమ్ సాగర్ కూడా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసారు.

Advertisement

యూట్యూబర్ అనిల్ కు మాత్రం ఆఖరి నిమిషంలో బిగ్ బాస్ ఛాన్స్ చేజారిపోయింది. ఇందుకు ఆయన బాధపడ్డారు కూడా. జబర్దస్త్ నరేష్ కు కూడా ఈ అవకాశం రాగా.. జబర్దస్త్ రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళడానికి అతను ఇష్టపడలేదు. అదీ కాకుండా ఆస్ట్రేలియా ఓ షో చేయాల్సి ఉండడంతో.. బిగ్ బాస్ రిజెక్ట్ చేయడానికి అది కూడా ఓ కారణం. సీరియల్ నటి పూజా మూర్తి కూడా ముందు సెలెక్ట్ అయ్యారు. కానీ, ఆమె తండ్రి మరణించడంతో చివరి క్షణంలో ఆమె బిగ్ బాస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో నటి అంజలి పవన్ కూడా రెమ్యునరేషన్ కారణంగా బిగ్ బాస్ నుంచి తప్పుకున్నారు. ఇలా బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చిన కొందరు రిజెక్ట్ చేసారు.

Visitors Are Also Reading